ఫలించిన అమరావతి రైతుల నిరీక్షణ, ప్రభుత్వం కీలక నిర్ణయం..!!
ఏపీ ప్రభుత్వం అమరావతి కేంద్రంగా కీలక నిర్ణయం తీసుకుంది. రాజధాని కోసం భూసమీకరణ చేసి 11 ఏళ్లు పూర్తవుతోంది. కాగా, కొందరు రైతులు ప్రభుత్వం వద్ద ప్రస్తావించిన సమస్యల పరి ష్కారం దిశగా కసరత్తు జరుగుతోంది. రిటర్నబుల్ ప్లాట్లు.. సాంకేతిక సమస్యల పైన ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. అందులో భాగంగా రైతులు సుదీర్ఘ కాలంగా డిమాండ్ చేస్తున్న కీలక సమస్యను పరిష్కరిస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.
రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన అసైన్డ్ రైతులకు సమస్యలను నుంచి పూర్తి విముక్తి లభించింది. సమస్యాత్మకంగా ఉన్న పాత పట్టాల స్థానంలో కొత్త ఏడాది కొత్తగా రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు ఇచ్చేందుకు సీఆర్డీఏ సిద్దమైంది. ఇప్పటికే కౌలు బకాయిలు.. సీఐడీ కేసులను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు గతంలో రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి ఇచ్చిన పట్టాల్లో అసైన్డ్ అనే పదాన్ని తెలిగించి కొత్తవి జారీ చేయనుంది. దీంతో, దళారుల ఆగడాలకు చెక్ పడనుంది. రాజధాని అమరావతి కోసం 3,139 మంది అసైన్డ్ రైతులు 2,689.14 ఎకరాల భూములు ఇచ్చారు. వీరికి సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు సమస్యాత్మకంగా మారాయి. రైతులు ఇచ్చిన భూమి వివరాలు తెలిపే చోట ఉన్న అసైన్డ్ అనే పదాన్ని ఆసరా చేసుకొని దళారులు వారిని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు.

దీంతో.. గజానికి రూ 10 నుంచి 20 వేలు తగ్గించి కొనుగోలు చేసారు. ఈ క్రమంలో వారి మొరను ఆలకించిన ప్రభుత్వం దిద్దుబాబు చర్యలకు ఆదేశించింది. రైతులకు ఇచ్చే పట్టాల్లో అసైన్డ్ పదం తొలిగిస్తూ పురపాలక శాఖ గత ఏడాది అక్టోబర్ లో జీవో 187 జారీ చేసింది. రైతులకు జారీ చేసిన పట్టాల్లో భూ సమీకరణ చట్టం మార్చాలని సూచించింది. ఆ మేరకు రిటర్నబుల్ ప్లాట్ల పట్టాదారులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టా జారీ చేయాలని పేర్కొంది. అయితే, కొత్తగా ఇచ్చే పట్టాలకే జీవో వర్తిస్తుందని సీఆర్డీఏ చెప్పటంతో కొంత గందరగోళం నెలకొంది. దీంతో.. అప్పటికే పట్టాలు పొందిన 95 శాతం మంది రైతులు మరోసారి ప్రభుత్వంలో చర్చలు చేసారు. ఈ నేపథ్యంలో పాత పట్టాల స్థానంలో దరఖాస్తు చేసుకున్న పలువురు రైతులకు కొత్త పట్టాలు నిర్ణయించింది.












Click it and Unblock the Notifications