వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గవర్నర్ స్పీచ్: విమర్శలు, సభ్యుల ఆందోళన(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ బుధవారం చేసిన ప్రసంగం కేవలం 22 నిమిషాల్లో ముగిసింది. ఎన్నికల తర్వాత ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం ఆనవాయితీ. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన గవర్నర్ ప్రసంగం 11.22 గంటలకు పూర్తయింది. గవర్నర్ అసెంబ్లీ ఆవరణలోకి రాగానే శాసనపరిషత్తు చైర్మన్ నేతి విద్యాసాగర్, శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి, ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు తదితరులు ఆయనకు ఆహ్వానం పలికారు.

వేదికపై మూడు కుర్చీలు వేశారు. ఒకటి గవర్నర్‌కోసం ఉద్దేశించింది కాగా, ఇంకొకటి శాసనపరిషత్తు చైర్మన్‌కు, మరొకటి శాసనసభ స్పీకర్‌కు ఉద్దేశించారు. 11 గంటలకు గవర్నర్ వేదికపైకి రాగానే జాతీయ గీతాలాపన జరిగింది. సభ్యులకు అభివాదం చేశాక గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ప్రసంగం పూర్తికాగానే గవర్నర్ వెళ్లిపోయారు. గతంలో గవర్నర్ ప్రసంగం దాదాపు గంటపాటు కొనసాగేది. 50-60 పేజీల్లో ఆ ప్రసంగం ఉండేది.

ప్రభుత్వం తాను చేసిన పనులు, చేయబోయే పనులు, పథకాలు, కార్యక్రమాలు, ప్రాధాన్యతల గురించి గవర్నర్ ద్వారా చెప్పించడం ఆనవాయితీ. ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగంలో టిఆర్ఎస్ మ్యానిఫెస్టోలా ఉందని వారు ఆరోపించారు. రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించలేదని విమర్శించారు.

లక్ష్మణ్ విమర్శలు

లక్ష్మణ్ విమర్శలు

గవర్నర్ ప్రసంగం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర విపక్షాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఆగ్రహం వ్యక్తం చేశాయి. కొత్త ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆశలు నెరవేర్చేలా లేదని బిజెపిఎల్పీ నేత లక్ష్మణ్ అన్నారు.

పొంగులేటి, కోమటిరెడ్డి

పొంగులేటి, కోమటిరెడ్డి

గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారని, గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదన్నారు.

విపక్షాల విమర్శలు

విపక్షాల విమర్శలు

ఉభయసభలనుద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. గవర్నర్ ప్రసంగంలో టిఆర్ఎస్ మ్యానిఫెస్టోలా ఉందని వారు ఆరోపించారు.

కోమటిరెడ్డి నిప్పులు

కోమటిరెడ్డి నిప్పులు

గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా రాష్ట్ర ఉద్యోగులకు వేతనాలు ఇస్తామని కెసిఆర్ ప్రకటించారని, గవర్నర్ ప్రసంగంలో ఆ ఊసే లేదన్నారు. నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ బాధితుల ప్రస్తావన కూడా లేదన్నారు.

కోమటిరెడ్డి

కోమటిరెడ్డి

ఖరీఫ్ రైతులకు ప్రభుత్వ పరంగా ఎలాంటి హామీ లభించలేదని కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రుణమాఫీపై ఆందోళనతో ఇప్పటికే పదిహేను, ఇరవై మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.

మీడియా పాయింట్ వద్ద కోలాహలం

మీడియా పాయింట్ వద్ద కోలాహలం

రైతు రుణమాఫీపై స్పష్టత ఇవ్వకుండా ప్రభుత్వం తప్పించుకుంటోందని విపక్ష నాయకులు మండిపడ్డారు. గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ప్రతిబింబించలేదని విమర్శించారు.

జీవన్ రెడ్డి

జీవన్ రెడ్డి

ఉభయసభలనుద్దేశించి చేసిన గవర్నర్ నరసింహన్ ప్రసంగం టిఆర్ఎస్ మెనిఫెస్టోలా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆరోపించారు.

టిడిపి సభ్యులు

టిడిపి సభ్యులు

ఉభయసభలనుద్దేశించి గవర్నర్ నరసింహన్ చేసిన ప్రసంగం టిఆర్ఎస్ మెనిఫెస్టోలా ఉందని టిటిడిపి నేతలు విమర్శించారు.

ఎర్రబెల్లి

ఎర్రబెల్లి

బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. రుణమాఫీపై కేసీఆర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ హామీని అమలు చేయాలన్నారు.

వైయైస్సార్ కాంగ్రెస్ సభ్యులు

వైయైస్సార్ కాంగ్రెస్ సభ్యులు

బుధవారం జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు.

ఆర్ కృష్ణయ్య

ఆర్ కృష్ణయ్య

కెజి నుంచి పీజీ వరకు ఉచిత విద్యపై స్పష్టత ఇవ్వాలని టిడిపి ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య అన్నారు. తెలంగాణ పబ్లిక్ కమిషన్ ఏర్పాటు చేసి ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. బీసీలకు ఎంత బడ్జెట్ కేటాయిస్తారో తెలపాలని ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.

మంత్రులతో టిడిపి నేతలు

మంత్రులతో టిడిపి నేతలు

అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలతో టిడిపి ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి.

ఈటెలతో ఎర్రబెల్లి

ఈటెలతో ఎర్రబెల్లి

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో మంత్రి ఈటెల రాజేందర్, ఇతర ఎమ్మెల్యేలతో టిడిపి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు పలకరింపులు.

మీడియా పాయింట్ వద్ద మంత్రి ఈటెల

మీడియా పాయింట్ వద్ద మంత్రి ఈటెల

ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రుణమాఫీ చేసి తీరుతామని మంత్రి ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు.

English summary

 The Governor of Telangana, ESL Narasimhan's speech which was addressed to the first Telangana assembly and council members at Telangana assembly on Wednesday has met the controversy as the leaders like Komatireddy Venkat reddy and Laxman and Ponguleti Sudhakar Rao have alleged that Governor's speech is nothing but the replication of Telangana CM K Chandra Shekhar Rao's election manifesto.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X