నూతన నిఘా చీఫ్, విజయవాడ సీపీగా ఛాన్స్ వీరికే - ఈసీకి నివేదిక..!!
ఏపీలో ఎన్నికల వేళ వరుసగా అధికారుల పైన వేటు పడుతోంది. ఫిర్యాదుల ఆధారంగా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. తాజాగా ఇద్దరు ఐపీఎస్ లపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులు, విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తాతాను ఎన్నికలతో సంబంధంలేని విధులకు బదిలీ చేయాలని ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వీరి స్థానంలో కొత్త వారి నియామకానికి పేర్లను నివేదించారు.
ఎన్నికల సంఘం నిఘా చీఫ్, విజయవాడ సీపీల పైన చర్యలు తీసుకుంది. వీరిద్దరి స్థానంలో కొత్త అధికారుల నియామకం కోసం... ముగ్గురేసి పేర్లతో బుధవారం మధ్యాహ్నం 3 గంటల్లోపు జాబితా పంపాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని ఆదేశించింది. వీరిద్దరూ సత్వరం తమ కిందిస్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించి... రిలీవ్ కావాలని ఆదేశించింది. డ్ వెలువడిన తర్వాత ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఆరుగురు ఐపీఎస్ లు, ముగ్గురు ఐఏఎస్ లను పక్కకు తప్పించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు... మరో ఇద్దరు ఐపీఎ్‌సలపై బదిలీ వేటు వేసింది.

నిఘా చీఫ్ పీఎస్సార్, కాంతిరాణాపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, వారిపై ఆరోపణలను ధ్రువీకరించుకున్న తర్వాతే ఈసీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా, ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ ఇద్దరి స్థానంలో కొత్త వారి నియామకం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొత్త పేర్లతో ఎన్నికల సంఘానికి నివేదకి ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇంటలిజెన్స్ చీఫ్ గా కుమార్ విశ్వజిత్, అతుల్ సింగ్ పేర్లను ప్రతిపాంచినట్లు సమాచారం. ఇక.. విజయవాడ నగర పోలీసు కమిషనర్ గా ముగ్గురి పేర్లను ప్రతిపాదించారు. ఐపీఎస్ అధికారలు పీహెచ్ డీ రామక్రిష్ణ, త్రివిక్రమ్ వర్మ, వినీత్ బ్రిజ్ లాల్ పేర్లను సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. వీరిలో ఎన్నికల సంఘం ఈ రెండు పోస్టుల్లో నియామకం చేస్తుందని నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.












Click it and Unblock the Notifications