ఏపీలో తుఫాను వాతావరణం

నైరుతి రుతుపవనాలు ఈనెల 19న అండమాన్ నికోబార్ దీవుల్ని చేరుకుంటాయని భారత వాతావరణ విభాగం (IMD) అంచనా వేసింది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో తుఫాను తరహా వాతావరణం నెలకొంటుందని, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.

రాత్రంతా మోస్తరు వాన
శనివారంనాడు ఏపీ అంతా మేఘాలు అలముకుంటాయి. పశ్చిమ రాయలసీమలో సాధారణ వాన, మధ్యాహ్నం 12.00 గంటల తర్వాత కోస్తా, గుంటూరులో మోస్తరు వర్షం కురవనుంది. అదేరోజు మధ్యాహ్నం 2.00 గంటల తర్వాత నంద్యాల, విశాఖపట్నం, తుని, కాకినాడలో మోస్తరు వర్షాలు పడతాయి. సాయంత్రం 4.00 గంటల తర్వాత తిరుపతి, కడప, శ్రీకాకుళం, నెల్లూరులో తేలికపాటి జల్లులు కురవనున్నాయి. సాయంత్రం 6.00 గంటల తర్వాత దక్షిణ రాయలసీమలో మోస్తరు వాన రాత్రంతా కురుస్తూనే ఉంటుంది.

cyclonic circulation over andhra pradesh says imd weather report

గుంటూరు 71 శాతం తేమ
బంగాళాఖాతంలో గంటకు 9 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో, ఏపీలో గంటకు 8 నుంచి 15 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. ఉష్ణోగ్రతలు 29 నుంచి 34 డిగ్రీల మధ్య నమోదవుతాయి. మేఘాలుండటంవల్ల ఎండ ఉన్నప్పటికీ దాని ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. ఏపీలో తేమ బాగా ఉంటుంది. గుంటూరులో 71 శాతం తేమ ఉంది. అలాగే విశాఖపట్నంలో 66 శాతం ఉంది. మధ్యాహ్నం తర్వాత తేమ శాతం పెరుగుతూ సాయంత్రానికి 100 శాతం తేమ ఉండి భారీ వర్షాలు కురవనున్నాయి. నైరుతి రుతుపవనాలు ఈనెల 31వ తేదీకి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేసింది. ఈ ఏడాది వర్షాలు కూడా అధికంగానే పడతాయని, దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సాధారణానికి మించిన వర్షాలు కురుస్తాయని, ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+