పీకేసేవారు: కిరణ్‌పై దాడి నిప్పులు, బాబు యాత్ర పైనా

ముఖ్యమంత్రి తాను రాజీనామా చేయకుండా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామా చేయకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. కొందరు రాజీనామాలు ఇచ్చినా వాటిని ఆమోదించే పరిస్థితి లేదన్నారు. ఇదంతా ఓ డ్రామా అన్నారు. జివోఎం ఏర్పాటు, చర్చలు, తెలంగాణ ప్రక్రియ కొనసాగింపు అన్ని జరిగిపోతున్నాయని అయినా ముఖ్యమంత్రి సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నిజంగా కిరణ్ అధిష్టానానికి వ్యతిరేకమైతే ఎప్పుడో పీకేసే వారన్నారు.
సీమాంధ్రలో కాంగ్రెసు పార్టీ మట్టికొట్టుకుపోతుందనే ఉద్దేశ్యంతో కొత్త పార్టీ పెట్టడానికి సిఎం సిద్ధమవుతున్నారని, సమైక్యాంధ్రకు అనుకూలంగా పార్టీ పెట్టి సీట్లు గెలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా సోనియా గాంధీ కుమ్మక్కులో భాగమేనన్నారు.
తెలుగుదేసం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వచ్చే సమావేశాల్లో అవిశ్వాసం పెట్టగలరా అని సవాల్ చేశారు. బాబు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్ర ఎవరికోసమన్నారు. కాంగ్రెసుకు వ్యతిరేకంగా ఎవరు అవిశ్వాసం పెట్టినా మద్దతిస్తామన్నారు. అన్ని పార్టీలు సీమాంధ్ర ఉద్యమంలోకి రావాలన్నారు. ముఖ్యమంత్రి రాజీనామా చేసి రావాలన్నారు.
బాబు, కిరణ్‌ల అండతోనే: భూమన
చంద్రబాబు, కిరణ్ కుమార్ రెడ్డిల అండతోనే సోనియా విభజనకు మొగ్గుచూపారని భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. విభజనకు అనుకూలంగా ఢిల్లీలో బాబు దీక్ష చేశారని మండిపడ్డారు. రాష్ట్ర సమైక్యతకు విఘాతం కలిగించింది వారిద్దరే అన్నారు.
-
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
పదో తరగతి పరీక్షల్లో పొరపాట్లు, ఆ రెండు సబ్జెక్టుల్లో మార్కుల యాడింగ్..ఇలా..!! -
కేంద్రం బ్రహ్మాస్త్రం: రూ. 2.5 లక్షల కోట్ల భారీ పథకం -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ! -
చుక్కలు చూపుతున్న పసిడి రేట్లు -
ఎవరైనా ఇలా చేస్తే అమరావతి చట్టబద్ధత రద్దవుతుంది: బాంబు పేల్చిన సాయిరెడ్డి -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
No Stock: ధర చూస్తే గుండె గుభేల్! డ్రైవర్ల కన్నీటి గాథ! -
గ్యాస్ కష్టాలకు చెక్, ఇలా చేస్తే వెంటనే మీ ముందుకే సిలిండర్..!! -
అయ్యో.. విజయ్ ఎలక్షన్ ర్యాలీలో అపశ్రుతి.. -
అమరావతితో కూడిన ఏపీ కొత్త మ్యాప్ వచ్చేసింది.. తేడాలు సుస్పష్టం !!












Click it and Unblock the Notifications