ముంచుకొస్తున్న ‘శక్తి’ తుపాను, ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..!!

అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి 'శక్తి'గా ఐఎండీ నామకరణం చేసింది. ఇది తీవ్ర తుపానుగా బలం పుంజుకుంటుందని అంచనా వేసింది. ఫలితంగా మహారాష్ట్ర పైన ఎక్కువగా ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలుగు రాష్ట్రాల్లో నూ భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు పలు జిల్లాలకు వాతావరణ శాఖ తాజా అలర్ట్స్ జారీ చేసింది. ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా భారీ వర్షాలతో తడిసి ముద్దయింది.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలో గోపాల్‌పూర్‌ సమీపంలో తీరం దాటింది. ఆ సమయంలోనే తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. శుక్రవారం ఉదయానికి ఇది వాయుగుండంగా బలహీనపడింది. ఇది ఉత్తర - వాయవ్య దిశగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ మీదుగా కదులుతూ ఈ సాయంత్రానికి తీవ్ర అల్పపీడనంగా బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అరేబియా సముద్రంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుపానుగా రూపాంతరం చెందింది. దీనికి 'శక్తి'గా పేరు ఖరారు చేసారు. ద్వారకకు నైరుతి దిశగా 240 కిలోమీటర్లు, పోర్‌బందర్‌కు పశ్చిమం వైపుగా 270 కిలోమీటర్ల దూరంలో అరేబియా సముద్రంలో ఈ అల్పపీడనం ఏర్పడింది.

deep-depression-intensified-into-a-cyclonic-storm-shakhti-over-ne-arabian-sea

కాగా, అనంతరం అది వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతోంది. ఇది ప్రస్తుతం తుపానుగా మారింది. దక్షిణ అంతర కర్ణాటక నుంచి కొమోరిన్ ప్రాంతం వరకు తమిళనాడు అంతరభాగంగా సగటుసముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ యానాంలో దిగువ ట్రోపో ఆవరణంలో వాయువ్య నైరుతి గాలులు వీస్తున్నాయి.

వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ కోస్తా లో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. రాయలసీమ లో భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+