వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయం: జోస్యం చెప్పిన రోజా

వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు చమరగీతం పాడతారని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో మాట్లాడుతూ చంద్రబాబును విమర్శించారు.

ఒంగోలు: వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధించి అధికారంలోకి రావడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా జోస్యం చెప్పారు. ఒంగోలులో జరిగిన వైసీపీ ప్లీనరీలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు చమరగీతం పాడతారని అన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న చంద్రబాబు నాయుడు పాలనకు చమరగీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు.

mla-roja

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు అజెండాను, తెలుగుదేశం పార్టీ జెండాను భూస్థాపితం చేసే సమయం దగ్గరపడిందని ఆమె వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+