హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

నోట్ల రద్దు ఎఫెక్ట్: అబిడ్స్ జీపీవోలో సీబీఐ తనిఖీలు, కొన్నిచోట్ల అర్ధరాత్రి దాకా. (పిక్చర్స్)

రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు గురువారం నాడు హైదరాబాదు నడిబొడ్డున ఉన్న అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ (జీపీవో)లో సోదాలు నిర్వహిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేపథ్యంలో సెంట్రల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) అధికారులు గురువారం నాడు హైదరాబాదు నడిబొడ్డున ఉన్న అబిడ్స్ జనరల్ పోస్టాఫీస్ (జీపీవో)లో సోదాలు నిర్వహిస్తున్నారు. సెర్చ్ ఆపరేషన్ కోసం తలుపులు మూసేశారు.

జీపీవోలోని మొదటి అంతస్తును పూర్తిగా సీబీఐ అధికారులు తమ ఆదీనంలోకి తీసుకున్నారని తెలుస్తోంది. నోట్ల మార్పిడి డిపాజిట్ల తీరును సిబిఐ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, నోట్ల మార్పిడి రద్దు నేపథ్యంలో అక్రమాలు జరుగుతున్నాయన్న సమాచారంతో సీబీఐ స్పందించినట్లుగా తెలుస్తోంది.

కాగా, పెద్ద నోట్ల మార్పిడీకి కొందరు పెద్దలు పోస్టాఫీసును వాడుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. పోస్టల్ సిబ్బంది సహకారంతో భారీగా చేతులు మారాయనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సిబిఐ సోదాలు నిర్వహించింది.

నాలుగు పోస్టాఫీసుల్లో

నాలుగు పోస్టాఫీసుల్లో

హైదరాబాదులో నాలుగు పోస్టాఫీసుల్లో గురువారం సీబీఐ అధికారులు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఆబిడ్స్‌ జీపీవో, హిమాయత్‌నగర్‌, ఖైరతాబాద్‌, సనత్‌నగర్‌లలోని తపాలా కార్యాలయాల్లోని రికార్డులను పరిశీలించి అనుమానాస్పదంగా ఉన్న లావాదేవీలను స్వాధీనం చేసుకున్నారు.

అబిడ్స్ జిపివోలోను

అబిడ్స్ జిపివోలోను

ఆబిడ్స్‌ జీపీవోలో 45 నిముషాలు, ఖైరతాబాద్‌లో నలభై నిముషాలు రికార్డులు పరిశీలించి వెళ్లారు. హిమాయత్‌నగర్‌ తపాలా కార్యాలయానికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వచ్చిన సీబీఐ అధికారులు రికార్డులు, నగదును పరిశీలించారు.

అర్ధరాత్రి దాకా తనిఖీలు

అర్ధరాత్రి దాకా తనిఖీలు

సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో జిరాక్స్‌ యంత్రాలు తెప్పించారు. అర్ధరాత్రి దాటినా తనిఖీలు కొనసాగిస్తూనే ఉన్నారు. తనీఖీలు నిర్వహిస్తున్నామని, పూర్తయ్యాకే వివరాలు చెబుతామని సిబిఐ అధికారులు చెప్పారు.

అవకతవకలు లేవని

అవకతవకలు లేవని

నాలుగు పోస్టాఫీసుల్లో సీబీఐ అధికారులు సాధారణ తనిఖీలు నిర్వహించారని హైదరాబాద్‌ నగర తపాల�� కార్యాలయాల సీనియర్‌ సూపరింటెండెంట్‌ సుధీర్ బాబు తెలిపారు. ఇప్పటివరకూ ఎలాంటి అవకతవకలు జరిగినట్లుగా అధికారులు నిర్ధారించలేదన్నారు.

English summary
Demonetisation: CBI search operation in GPO
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X