దెందులూరు పాలిటిక్స్; చింతమనేని వర్సెస్ అబ్బయ్య చౌదరి; అక్కడ జరుగుతుంది తెలిస్తే షాక్!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటే.. దెందులూరు నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరుకుంది. గతంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలా ఉన్న దెందులూరులో గత ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి కొఠారి అబ్బయ్య చౌదరి దాదాపు 17 వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఇక ఈసారి దెందులూరులో ఎన్నికల రాజకీయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది ప్రస్తుతం అక్కడ ఆసక్తికరంగా మారింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమరం మొదలు కాగా, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు హోరాహోరీగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ షర్మిల కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మరొకవైపు దెందులూరు నియోజకవర్గంలో కూడా ఎన్నికల వాతావరణం వేడెక్కింది.

అటు వైసిపి నుండి అబ్బయ్య చౌదరి, తెలుగుదేశం పార్టీ నుండి చింతమనేని ప్రభాకర్ ఇద్దరు ఎన్నికల ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈసారి ఎన్నికల్లో గెలవడం చింతమనేని ప్రభాకర్ కు చావో, రేవో అన్న అంశంగా మారడంతో, ఆయన నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో అబ్బయ్య చౌదరి కూడా ప్రజాక్షేత్రంలోకి వెళుతూ జగన్ అందిస్తున్న సంక్షేమాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
అంతే కాదు క్షేత్రస్థాయిలో చాప కింద నీరులా ఎవరికివారు ఎలక్షన్ పాలిటిక్స్ కు శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో దెందులూరు నియోజకవర్గంలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్న దానిపైన ఆసక్తికర చర్చ జరుగుతుంది. ఆ చర్చ కాస్త బెట్టింగుల దాకా వెళుతుంది. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని కొందరు, వైసిపి నే గెలుస్తుందని మరికొందరు కోట్ల రూపాయల బెట్టింగులు కడుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మారుస్తున్నారు.
తాజాగా ఏపీలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో చింతమనేని ప్రభాకర్ గెలుస్తారని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ధీమాతో ఉన్నారు. జగన్ అందించిన సంక్షేమ పథకాలే తనకు విజయాన్ని అందిస్తాయని కొఠారు అబ్బయ్య చౌదరి వర్గం కూడా ధీమాతో ఉన్నారు. ఏదేమైనా ఏపీలో అప్పుడే ఎన్నికలకు సంబంధించి బెట్టింగుల పర్వం కొనసాగుతుండడం అక్కడి పొలిటికల్ హీట్ ఎలా ఉందో అర్థమయ్యేలా చెబుతోంది.












Click it and Unblock the Notifications