మారుతున్న సమీకరణాల వేళ పవన్ బిగ్ ప్లాన్, ఇక నుంచి..!!
ఏపీలో రాజకీయం మారుతోంది. కొత్త లెక్కలు తెర మీదకు వస్తున్నాయి. సమీకరణాలు ఆసక్తి కరం గా మారుతున్నాయి. కొద్ది రోజులుగా పవన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వరుసగా పార్టీ సమావేశాలు నిర్వహించిన పవన్ రెండు జిల్లాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక.. పార్టీ కమిటీలను తానే పర్యవేక్షిస్తానని ప్రకటించారు. ఇక, ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదా లో పాలనా పరంగా ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. కాకినాడ కేంద్రంగా ఈ కార్యక్రమానికి పవన్ శ్రీకారం చుడుతున్నారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో యాక్టివ్ అవుతున్నారు. గోదావరి జిల్లాల నుంచే తిరిగి తన కార్యాచరణ వేగవంతం చేస్తున్నారు. స్థానిక ప్రజలతో మమేకం కావాలని డిసైడ్ అయ్యారు. పవన్ డిప్యూటీ సీఎం అయిన కొత్తల్లో అనేక మంది తమ సమస్యలు చెప్పుకునేందుకు పవన్ వద్దకు వచ్చేవారు. వారి నుంచి పవన్ వినతులు స్వీకరించే వారు. కాగా..ఇప్పుడు తానే స్వయంగా ప్రజలతో మమేకం అవుతూ.. స్థానిక అధికారుల సమక్షంలో వారి సమస్యలు తెలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇందు కోసం కాకినాడ నుంచి మన ఊరు.. మాట మంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు నిర్ణయించారు. రేపు (ఆదివారం) ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు పవన్ షెడ్యూల్ ఫిక్స్ అయింది. గోదావరి కళాక్షేత్రం వేదికగా మూడు గంటల పాటు పవన్ ప్రజలతో మమేకం అవుతారు. స్థానిక మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు, సాగునీటి ఇబ్బందులతో పాటు క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై ప్రజలతో ముఖాముఖి చర్చించనున్నారు.

కాకినాడ కేంద్రంగా పవన్
ప్రజలు చెప్పే సమస్యల పైన అక్కడికి అక్కడే అధికారుల నుంచి హామీతో పాటుగా.. స్పష్టత ఇచ్చే విధంగా పవన్ చొరవ తీసుకోనున్నారు. ఇందు కోసం స్థానికంగా ఇప్పటికే సమాచారం అందించారు. పవన్ తో పాలుగా పార్లమెంటరీ పరిధిలోని ఎంపీతో సహా ఎమ్మెల్యేలు.. ప్రజా ప్రతినిధులు హాజరు అవుతారు. అదే విధంగా జిల్లా కలెక్టర్, వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా హాజరుకానున్నారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, సమస్యలపై ఉప ముఖ్యమంత్రి స్పాట్‌లోనే అధికారులతో సమీక్షించి, తక్షణ పరిష్కారానికి ఆదేశాలు జారీ చేయనున్నారు. దీని ద్వారా పవన్ పార్టీతో పాటుగా పాలనా పరంగా ప్రజలతో మమేకం అయ్యేలా మరిన్ని ప్రాంతాల్లో ఇదే తరహా కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్దం అవుతున్నారు.













Click it and Unblock the Notifications