ఆఫీసులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఉద్యోగి

హైదరాబాద్: అనంతపురంలోని సాక్షర భారత కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ ఈశ్వరయ్య సోమవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం స్ధానికంగా కలకలం సృష్టించింది.

సోమవారం ఉదయం విధులకు హాజరవుదామని వచ్చిన ఉద్యోగాలకు ఈశ్వరయ్య ఉరేసుకుని కనిపించడంతో వారంతా షాక్‌కు గురయ్యారు. పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Deputy director eswaraiah commits suicide in office at Anantapur

కార్యాలయంలోనే ఈశ్వరయ్య ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలు ఏమిటనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. మరణవార్తను తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్ధలికి చేరుకుని, రోదిస్తున్నారు.

గతంలో ఒంగోలు పీవోగా పని చేసిన ఈశ్వరయ్య, ఏడాది క్రితం అనంతపురం సాక్షర భారత కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్‌గా బదిలీపై వచ్చారు. కింద స్ధాయి ఉద్యోగులు సహకరించక పోవడం, కొన్ని అవినీతి ఫైళ్లపై సంతకం పెట్టాలని కింది స్ధాయి సిబ్బంది బలవంతం చేయడం వల్లనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నారని ఈశ్వరయ్య భార్య ఆరోపిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+