పవన్ రాకపై దేవినేని, సీట్లమ్ముకుంటున్నారని జగన్‌పైన

Devineni Umamaheswara Rao
విజయవాడ: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తమ పార్టీలోకి వస్తారనే ప్రచారం పైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం స్పందించారు. పవన్ తమ పార్టీలోకి వస్తానంటే అది పార్టీ అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. భావసారూప్యం కలిగిన వారు ఎవరు వచ్చినా తాము ఆహ్వానిస్తామని చెప్పారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ, ఆ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన నిప్పులు చెరిగారు.

హైదరాబాదులో జగన్ సమైక్య శంఖారావం 10 జన్‌పథ్ మెప్పు పొందేందుకే అన్నారు. నర్సాపురం, విజయవాడ టిక్కెట్లను రూ.50 కోట్ల నుండి వంద కోట్ల వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బేరం పెట్టిందని ఆరోపించారు. టిడిపి విభజన బిల్లును అడ్డుకుంటుందన్నారు.

వైయస్ జగన్ సమైక్యం ముసుగులో విభజనకు పరోక్షంగా సహకరిస్తున్నారని నిప్పులు చెరిగారు. జగన్ ఎంపీ సీట్లను అమ్ముకుంటున్నారన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీని పల్లెత్తు మాట అన్నా జగన్ సహించరని ఎద్దేవా చేశారు. అందుకు ఆ పార్టీ నేత దాడి వీరభద్ర రావుకు క్లాస్ పీకడమే నిదర్శనం అన్నారు.

తెలంగాణలో జెండా ఎత్తేసిన జగన్ సమైక్య రాష్ట్రాన్ని ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ డ్రామాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+