'జగన్ ప్రధానమంత్రి అవుతాడంటున్నారు, బొత్స ఓ దొంగ.. అది మా ఖర్మ'

రైతు దీక్షలో వైసిపి నేతలు రైతుల గురించి మాట్లాడకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రధానమంత్రి అవుతారని మాట్లాడటం విడ్డూరమని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం నాడు మండిపడ్డారు.

విజయవాడ: రైతు దీక్షలో వైసిపి నేతలు రైతుల గురించి మాట్లాడకుండా జగన్ ముఖ్యమంత్రి అవుతారని, ప్రధానమంత్రి అవుతారని మాట్లాడటం విడ్డూరమని మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం నాడు మండిపడ్డారు.

జగన్ గుంటూరు జిల్లాలో చేసిన రైతు దీక్ష‌పై ఆయన ఘాటు విమ‌ర్శ‌లు గుప్పించారు. దీక్ష‌కు కూర్చున్న వైసీపీ నేత‌ల మాటలు విచిత్రంగా ఉన్నాయన్నారు. తమ పార్టీ అధినేత సీఎం, ప్రధాని అవుతార‌ని మాట్లాడటం ఏమిటన్నారు. వైసీపీ దొంగ‌లు త‌మ‌ను విమర్శిస్తారా అన్నారు.

రైతు దీక్ష పేరిట వైసిపి నాట‌కాలాడింద‌ని దేవినేని మండిపడ్డారు. ఎన్నో కేసులు ఉన్న వ్య‌క్తులు త‌మ‌ని విమ‌ర్శిస్తున్నార‌న్నారు. రైతులు మిర్చి అమ్ముకొని వెళ్తుంటే వైసిపి నేతలు డ్రామాలు ఆడుతున్నారన్నారు. రైతు దీక్షను జగన్ పదవీ కాంక్షకు వేదిక చేశారన్నారు.

Devineni lashes out at Bosta and YS Jagan

రాష్ట్ర విభజనకు ప్ర‌ధాన కార‌ణం బొత్స సత్యనారాయణ పిసిసి అధ్య‌క్షుడిగా ఉండ‌డం, ర‌ఘువీరా రెడ్డి మంత్రిగా ఉండ‌డ‌మేన‌ని దేవినేని ఆరోపించారు. అటువంటి వ్య‌క్తులు ఇప్పుడు త‌మ‌పై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నార‌న్నారు. వ్యోక్స్ వ్యాగన్ దొంగ బొత్స అన్నారు. అలాంటి వ్యక్తి టిడిపిని విమర్శించడం మా ఖర్మ అన్నారు. అడ్రస్ లేని రఘువీరా కూడా విమర్శలు చేస్తున్నారన్నారు.

కాంగ్రెస్‌, వైసీపీ ఇరు పార్టీల నేత‌లు దొంగ‌లేన‌ని దేవినేని వ్యాఖ్యానించారు. చంద్ర‌బాబు నాయుడు ఎంతాగానో క‌ష్ట‌ప‌డి ఎన్నో కంపెనీల‌ను తీసుకు వస్తుంటే ప్ర‌తిప‌క్ష నేత‌లు అభివృద్ధిని అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారన్నారు.

ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్లే వ్యక్తి, సిబిఐ, ఈడీ కేసులు వెంటాడుతున్న వ్యక్తిని ప్రజలు నమ్మరని జగన్‌ను ఉద్దేశించి దేవినేని అన్నారు. దీక్షల పేరుతో మోసం చేయాలనుకుంటే కుదరదని చెప్పారు. దళారులు లేకుండా తాము పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నామని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+