ఉదయం కూడా చేశారు: టీపై దేవినేని, అశోక్‌బాబు గరం

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బోర్డు నిర్ణయాన్ని ఉల్లంఘించిందని, చివరకు మంగళవారం ఉదయం కూడా శ్రీశైలం ప్రాజెక్టు వద్ద విద్యుత్ ఉత్పత్తిని చేశారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు మంగళవారం మండిపడ్డారు.

కేంద్రమంత్రి ఉమాభారతితో దేవినేని ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తాము అన్ని విషయాలను ఉమాభారతి దృష్టికి తీసుకు వెళ్లామన్నారు. విద్యుత్ ఉత్పత్తి వల్ల రాయలసీమకు చాలా నష్టం జరుగుతుందన్నారు. శ్రీశైలం వివాదానికి సంబంధించి అన్ని వాస్తవాలను ఉమాభారతికి చెప్పామన్నారు.

కృష్ణా బోర్డు నిర్ణయంలో తాము ఎలాంటి జోక్యం చేసుకోబోమని ఉమాభారతి చెప్పారన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి కృష్ణా బోర్డు చైర్మన్‌ను విమర్శించడం దారుణమన్నారు.శ్రీశైలం రిజర్వాయర్‌లో నీటి మట్టం 854 అడుగుల కంటే కిందకు తగ్గితే రాయలసీమకు కష్టాలే అన్నారు.

854 అడుగులకు తగ్గిపోతే సాగు నీటితో పాటు తాగు నీటికీ కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సర్కారు ఏకపక్ష వైఖరి వల్లే వివాదం నెలకొందన్నారు. ఈ విషయాలన్నింటినీ బోర్డు దృష్టికి తీసుకెళ్లాలని ఉమాభారతి సూచించారన్నారు. తెలంగాణ మంత్రిని కూడా బోర్డు వద్దకే వెళ్లమని చెప్పినట్లు తమకు తెలిపారన్నారు.

కాగా, కృష్ణా రివర్‌ బోర్డు ఇచ్చిన ఆదేశాలపై స్పష్టత ఇచ్చి శ్రీశైలంలో విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేసేలా కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ ప్రభుత్వానికి స్పష్టమైన ఆదేశాన్ని లిఖిత పూర్వకంగా జారీ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌, ఇంజనీరింగ్‌ చీప్‌ ఎమ్ .వెంకటేశ్వర రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్‌ రావు పాల్గొన్నారు.

 Devineni meets Uma Bharthi

చేయడం అనైతికం: అశోక్ బాబు

తెలంగాణ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులను విధులు నిర్వహించకుండా కూర్చోబెట్టి జీతాలు ఇస్తుండటం అనైతికమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు విమర్శించారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాల వల్ల ఉద్యోగులు కూడా నష్టపోతున్నారన్నారు. ఇరు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్రం దృష్టి సారించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించాలన్నారు. మంగళవారం ఉదయం కుటుంబసమేతంగా అశోక్ బాబు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కేసీఆర్‌ తన రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటుంది, దానిని సీమాంధ్రులు ఏ విధంగా అడ్డుకుంటుంది వివరిస్తానంటే తాము గుంటూరులో సభ ఏర్పాటు చేస్తామని బలహీనవర్గాల జేఏసీ కన్వీనర్‌ వైవి సురేష్‌ అన్నారు.

టీడీపీతో పొత్తు కొనసాగుతుంది: కామినేని

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వాస్పత్రుల్లో ఈ ఏడాది వెయ్యి జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేస్తామని వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌ మంగళవారం అన్నారు. ఎంఆర్‌పీ రేట్లకే మందుల అమ్మకం జరుగుతుందని తెలిపారు. జూనియర్‌ వైద్యులతో రేపు ప్రభుత్వం చర్చలు జరుపుతుందని, వారి డిమాండ్లలో కొన్ని న్యాయబద్దంగా ఉన్నాయన్నారు. రేపు సాయంత్రానికి జూడాల ఆందోళన విరమింపజేస్తామని, ఈ నెలాఖరులోగా ఏపీ జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు జారీ చేయనున్నట్లు చెప్పారు. టీడీపీతో పొత్తు కొనసాగుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+