కాంగ్‌కు షాక్: జగన్‌పార్టీలోకి ధర్మాన, శ్రీకాకుళంపై కన్ను

దాదాపు ఎల్లుండి జగన్ సమక్షంలో చేరే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు. కుదరకపోతే నెలాఖరులోగా చేరనున్నారట. శ్రీకాకుళం పార్లమెంటు సీటు పైన ఆయన కన్ను వేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ధర్మాన సోదరుడు ధర్మాన కృష్ణదాసు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్నారు.
జగన్ ఆస్తుల కేసులో తన పట్ల కాంగ్రెసు పార్టీ అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుతో కలత చెందిన కారణంగానే ధర్మాన జగన్ వైపు వెళ్లేందుకు సిద్ధమయ్యారంటున్నారు. జగన్ కేసులో అరెస్టై జైలు జీవితం గడిపిన మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ కూడా అధిష్టానం వైఖరితో అసంతృప్తి చెంది జగన్ పార్టీలో చేరారు. ఇప్పుడు ధర్మాన సిద్దమయ్యారు. కాగా, గతంలో జగన్ పైన గతంలో ధర్మాన తీవ్రంగా విరుచుకుపడిన సందర్భాలు ఉన్నాయి.
'తెలంగాణ' కోసం నిరీక్షణ
రాష్ట్ర విభజనకు సిడబ్ల్యూసి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నెల 21న కేబినెట్ ముందుకు తెలంగాణ బిల్లు రానుంది. ఈ నేపథ్యంలో సమైక్యవాదం వినిపిస్తున్న ధర్మాన ఇది వచ్చాక జగన్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. తద్వారా కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని విభజిస్తున్నందువల్లే తాను పార్టీ మారుతున్నట్లు ప్రకటించేందుకు ధర్మానకు అవకాశం ఉంటుందంటున్నారు.












Click it and Unblock the Notifications