రైతులను లక్షాధికారులను చేస్తున్న వజ్రాల పంట!!

తొలకరి వర్షాలు పడితే కర్నూలు అనంతపురం జిల్లాలలో రైతులు వజ్రాల కోసం వేట మొదలుపెడతారు. ఇక ఈ సంవత్సరం కురుస్తున్న తొలకరి వర్షాలతోనూ వజ్రాలు లభిస్తున్న కొందరు రైతుల పంట పండుతోంది. రాయలసీమ జిల్లాలలో ఈ సీజన్ అదృష్టాన్ని పరీక్షించుకునే సీజన్. ఈ సీజన్ లో ప్రతి ఒక్కరూ పొలాలలో వజ్రాల వేట కొనసాగిస్తారు. ఇక నక్క తోక తొక్కిన అదృష్టవంతులకు వజ్రాలు దొరుకుతాయి.

ఎంతోమందిని ఇక్కడ దొరికే వజ్రాలు బికారుల నుండి అమీర్ లుగా మారుస్తున్నాయి. తొలకరి వర్షాల సమయంలో రాయలసీమ జిల్లాలలో ఎంతోమంది వ్యవసాయ కూలీలు, కొందరు గొర్రెల కాపరులు, వ్యవసాయం చేసుకునే రైతులకు వజ్రాలు దొరికిన అనేక ఉదంతాలు ప్రతీ సంవత్సరం చోటు చేసుకుంటూనే ఉన్నాయి.

Diamonds in kurnool agriculture farms; making farmers millionaires!!

ఈ సంవత్సరం ఇప్పటికే కర్నూలు జిల్లాలోని మద్దెకర మండలంలో బసినేపల్లి లో ఓ రైతుకు అత్యంత విలువైన వజ్రం దొరికింది. దానిని అమ్మకానికి పెట్టగా కొనడానికి వ్యాపారులు పోటీపడ్డారని ప్రచారం జరిగింది . చివరకు గుత్తికి చెందిన వజ్రాల వ్యాపారి ఆ రైతుకు దొరికిన అత్యంత విలువైన వజ్రాన్ని రెండు కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారని సమాచారం.

అయితే ఇక తాజాగా తుగ్గిలి మండలం జొన్నగిరి పొలాలలో ఒంగోలుకు చెందిన ఒక వ్యక్తికి తేనె రంగు వజ్రం లభించిందని జరుగుతుంది. ఈ వజ్రాన్ని స్థానిక వ్యాపారి 25 లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్టు సమాచారం. ఇక అదే రోజు మరో రెండు వజ్రాలు కూడా లభించినట్టు తెలుస్తుంది.

కర్నూలు జిల్లా మద్దికెర మండలం మదనంతపురం వాసి పొలంలో కలుపు తీస్తుండగా వజ్రం దొరికినట్లు ప్రచారం సాగుతోంది. ఓ మహిళా రైతు శనివారం పొలంలో కలుపు మొక్కలు తీస్తుండగా ముందు రోజు రాత్రి కురిసిన వర్షంతో మెరుస్తున్న రాయి ఒకటి ఆమెకు దొరికింది. దీన్ని ఆమె తీసుకువెళ్లి వ్యాపారికి చూపించగా వ్యాపారి 14 లక్షల రూపాయల నగదు, రెండు తులాల బంగారం ఇచ్చి ఆ వజ్రాన్ని తీసుకున్నట్టు సమాచారం.

దీంతో ఆమె ఒక్కరోజులోనే సదరు మహిళా వ్యవసాయ కూలీ లక్షాధికారి అయింది. ఏదిఏమైనా ఈ సీజన్ రాయలసీమ ప్రాంతంలో అదృష్టం ఉన్న రైతులకు, రైతు కూలీలకు వజ్రాల పంటను పండిస్తుంది వారిని రాత్రికి రాత్రే లక్షాదికారులుగా, కోటీశ్వరులుగా మారుస్తుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+