కూటమిలో బయటపడ్డ విభేదాలు..పంపకాల్లో తేడా రావడంతో
గతేడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మూడు పార్టీలు కలిసి వైసీపీని ఓడించాయి. అయితే ఈ మూడు పార్టీలు కలిసి ఉంటేనే జగన్‌ను ఓడించగలవని, విడిపోతే గెలుపు జగన్‌దే అని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఈ మూడు పార్టీలు కలిసి ఉండేలా కనిపించడం లేదు. ఇప్పటికే టీడీపీ, , బీజేపీ ,జనసేన పార్టీల మధ్య క్షేత్రస్థాయిలో విభేదాలు చోటు చేసుకున్నాయి. పార్టీల అధినాయకత్వంగా బాగానే ఉన్నప్పటికీ, ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తల మధ్య తీవ్ర విభేదాలు చోటు చేసుకుంటున్నాయి.
కొద్ది రోజుల క్రితం ధర్మవరంలో బీజేపీ మంత్రికి వ్యతిరేకంగా రోడ్డెక్కిన టీడీపీ శ్రేణులు..ఆ తర్వాత జనసేన మంత్రి కందుల దుర్గేష్‌కి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశాయి. కష్టపడి గెలిపించుకున్న మంత్రులు తమను పట్టించుకోవడం లేదని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇక డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నియోజకవర్గంలో అయితే టీడీపీ, జనసేనల మధ్య అధిపత్యపోరు నడుస్తోంది. తాజాగా మరోసారి కుటమిలో లుకలుకలు బయటపడ్డాయి. కర్నూల్ జిల్లాలో టీడీపీ,జనసేన పార్టీల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి.

కర్నూలులోనూ టీడీపీ-జనసేన నాయకుల మధ్య వివాదాలు రోడ్డెక్కాయి. ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ముందే ఈ రెండు పార్టీలకు చెందిన నాయకులు ఘర్షణకు దిగారు. టీడీపీ నేత మీనాక్షినాయుడు, జనసేన నాయకులకు మధ్య మాటా మాటా పెరిగి.. తీవ్రస్థాయిలో దూషించుకున్నారు. తర్వాత.. తోపులాటలకు దిగారు.స్థానికంగా డీలర్ షిప్‌ల వ్యవహారంలో పంపకాలు కుదరక పోవడం వల్లే వీరి మధ్య గొడవ జరిగినట్టు తెలుస్తోంది.
ఆదోని నియోజకవర్గంలో డీలర్ షిప్‌లను పంచుకునేందుకు టీడీపీ-జనసేన నాయకులు పోటీ పడ్డారు.నియోజకవర్గం వ్యాప్తంగా 70కిపైగా డీలర్ షిప్పులు ఉన్నాయి.టీడీపీ నాయకులు 32 డీలర్ షిప్‌లు కోరగా.. కాదు.. 35 మాకే ఇవ్వాలని జనసేన నాయకులు పట్టుబట్టారు. దీంతో వర్గాలు మధ్య గొడవ జరిగి అది తన్నుకునేంత వరకు వెళ్లింది. ఈ పంచాయితీ సీఎం చంద్రబాబు వద్దకు చేరడంతో ,టీడీపీ నాయకుడు మీనాక్షినాయుడిని ఆయన వివరణ కోరినట్టు తెలిసింది












Click it and Unblock the Notifications