మైలవరం టీడీపీలో బయటపడ్డ విభేదాలు

ఎన్నికలు దగ్గర పడుతున్నా కూటమిలో ఇంకా అసమ్మతి కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా టీడీపీ నేతల మధ్య అధిపత్యపోరు తారస్థాయికి చేరుకుంది.ఇప్పటికే టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మరికొందరు నేతలు పార్టీకి రాజీనామా చేసి అధికార వైసీపీలో చేరారు. ఇదిలా ఉంటే తాజాగా మైలవరం టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత కృష్ణ ప్రసాద్ పేరును ప్రకటించిన దగ్గర నుంచి కూడా పార్టీలో విభిన్న వాతావరణం కనిపిస్తోంది.

టీడీపీ హయంలో ఓ వెలుగు వెలిగిన దేవినేని ఉమకు టికెట్ నిరాకరించడంతో ఆయన వర్గం భగ్గుముంది. గడిచిన ఐదేళ్లుగా దేవినేని ఉమ, వసంత వర్గీయులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్న పరిస్థితి. ఇప్పుడు వసంతకు టీడీపీ టికెట్ కేటాయించడంతో దేవినేని వర్గం అసంతృప్తితో రగిలిపోతుంది.చంద్రబాబు దేవినేని ఉమని బుజ్జగించడంతో ఆయన సైలెంట్ అయ్యారు. వసంతతో దేవినేని చేతులు కలిపినప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం పార్టీ క్యాడర్ కలిసి పని చేయలేకపోతుంది. గతంలో దేవినేని ఉమతో ఉన్న విభేదాలతో ఆయన అనుచరులు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనకపోవడం వసంత కృష్ణ ప్రసాద్‌కు సంకటంగా మారింది.

Differences emerged in Mylavaram TDP

ఎన్నికల ప్రచారంలో భాగంగా మైలవరం మండలం గణపవరం గ్రామంలో పర్యటించిన సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్‌ ఎదురుగానే నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. దేవినేని అనుచరుడును అవమానించడంతో సమావేశం నుంచి కొందరు మధ్యలోనే వెళ్లిపోయారు. ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేసిన వసంత సైతం ఎన్నికల ప్రచారాన్ని మధ్యలోనే ముగించుకుని తిరుగు ప్రయాణం అయ్యారు. దేవినేని అనుచరులు సహకరించకపోవడం వసంత కృష్ణ ప్రసాద్‌‌కు పెద్ద సమస్యగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+