ఖమ్మం టిడిపిలో విభేదాలు, దాడి: ఎందుకోనని పొన్నం
ఖమ్మం/కరీంనగర్: ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. తుమ్మల నాగేశ్వర రావు వర్గీయులు.. పార్టీ నేత చైతన్యపై ఆదివారం దాడికి చేశారు. ఈ ఘటన తుమ్మల క్యాంప్ ఆఫీసు వద్ద జరిగింది. ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కాంగ్రెస్ అభ్యర్థికి సహకరించి తుమ్మల ఓటమికి కారణమయ్యారంటూ చైతన్యపై దాడికి పాల్పడ్డారు. దీంతో తుమ్మల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. చైతన్య పైన దాడిని అడ్డుకోబోయిన మరో నేతకు గాయాలయ్యాయి.
ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ... కొందరు తన ఓటమికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి సహకరించారని ఆరోపించారు. జిల్లాలో నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కొందరు రాజకీయ వ్యభిచారం చేస్తున్నారని, తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేశారన్నారు. జిల్లాలో తాను టిడిపిని కాపాడుతానని చెప్పారు. తాను పార్టీకి ద్రోహం చేయలేనని చెప్పారు.

చంద్రబాబు టి వ్యతిరేకి కాదు: ఎర్రబెల్లి
తమ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి కాదని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు. తెలంగాణలో విజయం సాధించిన టిడిపి అభ్యర్థులకు సోమవారం అభినందన సభ నిర్వహించనున్నట్లు టిడిపి నేత ఎల్ రమణ తెలిపారు. తెలంగాణ టీడీపీ నేతలు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఎల్ రమణ ఇవాళ పార్టీ అధినేత చంద్రబాబును కలిశారు. తెలంగాణ కోసం టిడిపి లేఖ ఇచ్చిన అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లలేకపోయామన్నారు.
ఎందుకు ఓడించారో: పొన్నం
ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పాటుపడితే తమను ఎన్నికల్లో ఓడించారంటూ కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వ్యతిరేక పార్టీలను గెలిపించారని ఆయన మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇచ్చిన హామీలను తెరాస అమలు చేయాలన్నారు.












Click it and Unblock the Notifications