టిపై డిగ్గీ: భంగపాటేనని 'కిరణ్ పార్టీ' ప్రచారంపై బొత్స!

న్యూఢిల్లీ/హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో చర్చకు ఈ నెల 23 వరకే రాష్ట్రపతి గడువు ఇచ్చారని రాష్ట్ర కాంగ్రెసు పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ మంగళవారం అన్నారు. ఉదయం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ చర్చ విషయంపై స్పీకర్ నాదెండ్ల మనోహర్, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో మాట్లాడుతానని చెప్పారు.

సభలో సజావుగా చర్చ సాగుతుండటం విశేషమన్నారు. అలాగే ఢిల్లీ సిఎం ధర్నాపై స్పందిస్తూ ఐఆర్ఎస్ అధికారిగా ఉన్నప్పుడే అరవింద్ కేజ్రీవాల్ చట్టాన్ని లెక్కచేయలేదని, ఇప్పుడేం లెక్క చేస్తారన్నారు.

 Diggy on Telangana Draft Bill

భంగపాటు తప్పదు: బొత్స

సమైక్యాంధ్రకు మద్దతుగా టీవీల్లో, సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ప్రచారంపై ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షులు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ హైదరాబాదులో మంగళవారం స్పందించారు.

ఆ ప్రచారం సమైక్యాంధ్రకు మద్దతుగానే ఇస్తున్నారని తాను భావిస్తున్నానని చెప్పారు. కొత్త పార్టీ నిజంగానే ఏర్పాటు చేయాలనుకుంటే 294 నియోజకవర్గాలలో హోర్డింగులు పెట్టాలి కదా అన్నారు. ఉద్యమం ముసుగులో రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటే వారికి భంగపాటు తప్పదన్నారు. కాగా ఇటీవల పెద్ద ఎత్తున సమైక్యాంధ్రకు అనుకూలంగా హోర్డింగులు, టీవిల్లో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నినాదం అందులో ఉందని, కాబట్టి ఆయన పార్టీ పెట్టేందుకే ఈ ప్రచారం జరుగుతోందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బొత్స వ్యాఖ్యలు కిరణ్‌కు కౌంటర్ అంటున్నారు.

కాగా, రాజ్యసభ అభ్యర్థుల ఖరారు కోసం ముఖ్యమంత్రితో కలిసి తాను ఢిల్లీకి వెళ్తమన్నారు. రాజ్యసభ సీటు ఆశించి విన్నపాలు చేసిన వారి వివరాలు అధిష్టానం ముందు ఉంచుతామన్నారు.

ధైర్యంగా ముందుకు రావాలి: షబ్బీర్ అలీ

సమైక్యాంధ్ర కోసం జరుగుతున్న ప్రచారం నేపథ్యంలో వారెవరో ధైర్యంగా ముందుకు రావాలని షబ్బీర్ అలీ అన్నారు. సమైక్యాంధ్ర కోసం పార్టీ పుట్టుకు వస్తే మరొకటి చేరుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+