బిజెపిలోకి దినేష్‌రెడ్డి, టిక్కెట్: తెరాసలోకి బాబు మోహన్

Dinesh Reddy to join BJP
హైదరాబాద్: మాజీ డిజిపి దినేష్ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో ఆయన బిజెపి టిక్కెట్ పైన ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గానికి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే చర్చలు జరిపినట్లుగా సమాచారం. ఒంగోలు నుండి బిజెపి టిక్కెట్ పైన బరిలోకి దిగుతున్న డిజిపి... అందుకు తెలుగుదేశం పార్టీ మద్దతు కూడా కోరినట్లు తెలుస్తోంది.

బిజెపి, టిడిపిల మధ్య పొత్తు దాదాపు కొలిక్కి వచ్చినట్లుగా ఊహాగానాలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఒంగోలు లోకసభ అభ్యర్థిగా టిడిపి ఇప్పటి వరకు ఎవరిని ప్రకటించ లేదు. దీంతో టిడిపి హామీతో బిజెపి తరఫున పోటీ చేయాలని దినేష్ రెడ్డి భావిస్తున్నారంటున్నారు.

ఇందుకు సంబంధించి ఆయన భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయతో ఫోన్లో మాట్లాడారని, అధిష్టానం దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వెళ్తానని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒంగోలు నుండి పోటీకి బిజెపి నేతల నుండి స్పష్టమైన హామీ రాగానే ఆయన అధికారికంగా ఆ పార్టీలో చేరే అవకాశముంది.

తెరాసలోకి బాబు మోహన్

సినీ నటుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బాబు మోహన్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. ఈ మేరకు తెరాస అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావుతో ఈ రోజు సాయంత్రం భేటీ కానున్నారు. ఈ నెల 26న అధికారికంగా సైకిల్ దిగి కారెక్కనున్నారని తెలుస్తోంది. అతనికి కెసిఆర్ ఆందోల్ టిక్కెట్ కేటాయించనున్నారు. మరోవైపు జగన్‌కు షాకిస్తూ తెరాసలో చేరనున్న బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి నిర్మల్ లేదా నిజామాబాద్ రూరల్ టిక్కెట్ ఇచ్చే అవకాశముంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+