ప్రత్యక్ష రాజకీయాలకు డిఎల్ రవీంద్రా రెడ్డి గుడ్‌బై

రాష్ట్ర విభజన నేపథ్యంలో సంభవించిన తాజా రాజకీయ పరిణామాలు కూడా ఆయన రాజకీయాల పట్ల విరక్తి పెంచుకోవడానికి కారణమని అంటున్నారు. వైయస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఆయన పేరుపడ్డారు. అయితే, వైయస్ రాజశేఖర రెడ్డి ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు.
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఆయన పోరాటం చేశారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో ఆయన చేరారు. అయితే, కిరణ్ కుమార్ రెడ్డితో ఆయన విభేదాలు పొడసూపాయి.
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి చురుగ్గా పని చేయడం లేదు. కడప జిల్లాలో ఆయన ప్రధాన నాయకుడిగా కొనసాగుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications