ఇష్టంలేకున్నా ఒప్పుకోవాలి: కిరణ్‌పై డొక్కా తిరుగుబాటు

Dokka differs with Kiran
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పైన సీమాంధ్ర కాంగ్రెసు పార్టీ నేతలు ఒక్కరొక్కరుగా తిరుగుబావుటా ఎగరవేస్తున్నారు! మంగళవారం ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నివాసంలో పలువురు నేతలు సమావేశమైన విషయం తెలిసిందే. ఈ భేటీ కిరణ్‌కు వ్యతిరేకంగానే అని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా బుధవారమం మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ముఖ్యమంత్రి తీరును తప్పుపట్టారు.

ఇష్టం ఉన్నా లేకున్న సిడబ్ల్యూసి నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా మంత్రివర్గ నిర్ణయాలను సమర్థించానని అలాగే సిడబ్ల్యూసి నిర్ణయాలని కాంగ్రెసు కార్యకర్తగా సమర్థించాల్సిందే అన్నారు. కిరణ్ వ్యాఖ్యలు తనకు ఆందోళన కలిగించాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధిష్టానం నిర్ణయానికి పార్టీ నాయకులు ఎవరైనా కట్టుబడి ఉండాల్సిందేనని డొక్కా చెప్పారు.

అధిష్టానాన్ని బహిరంగంగా వ్యతిరేకించడం సరికాదన్నారు. ఇది తనకు చాలా ఆవేదన కలిగించిందని చెప్పారు. అధిష్టానాన్ని ధిక్కరించడం మంచి సంప్రదాయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. సిఎం నిర్ణయాలు తమకు నచ్చకపోయినా తాము గౌరవించడం లేదా అన్నారు. ముఖ్యమంత్రి వద్ద భజన బృందం చేరి ఆయనను చెడగొడుతున్నారన్నారు. కిరణ్, ఆయన తండ్రి మొదటి నుండి కాంగ్రెసు పార్టీలో ఉన్నారని చెప్పారు.

ముఖ్యమంత్రి తనకు నచ్చలేదని డిఎల్ రవీంద్రా రెడ్డి, శంకర రావులను కేబినెట్ నుండి తొలగించారని విమర్శించారు. సమైక్య రాష్ట్రం కోరుకునే వాళ్లలో గాదె, కెవిపి, శైలజానాథ్ వంటి వారు ఐదాగురు మాత్రమే ఉన్నారన్నారు. మిగతా వారంతా గందరగోళంలో ఉన్నారని, పొగడ్తలకు కిరణ్ అలవాటుపడ్డారని విమర్శించారు. కొత్త పార్టీ వ్యాఖ్యలను ఆయన ఎందుకు ఖండించలేదన్నారు.

ఒక ప్రాంతం గురించి మాట్లాడటం సమైక్యమవుతుందా అని ప్రశ్నించారు. ఏవైనా సమస్యలు ఉంటే అధిష్టానం, కేంద్రంతో మాట్లాడి పరిష్కరించుకోవాలి కాని ప్రజలను ఆవేశాలకు లోను చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. తాను పార్టీకి అనుకూలంగా ఉంటానని చెప్పారు. ఎపిఎన్జీవోలు సమ్మెను విరమించాలని కోరారు.

బాబు ఇంత వరకు సమైక్యమనలేదు: అనంత

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు సమైక్యమనడం లేదని అనంతపురం ఎంపి అనంత వెంకట్రామి రెడ్డి వేరుగా అన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చి తప్పు చేశానని బాబు ఇప్పటి వరకు చెప్పలేదన్నారు. విభజన అంత సులువు కాదన్నారు. సీమాంధ్ర కాంగ్రెసు నేతల ఒత్తిడి వల్లనే తెలంగాణ నోట్ ఆగిపోయిందన్నారు. ఉద్యమానికి ఎవరైనా తలవంచాల్సిందేనని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+