‘డాన్స్ ఆఫ్ ది హిల్లరీ’పేరుతో వస్తుంది.. ఓపెన్ చేశారా.. బుక్కయిపోయినట్లే!

Posted By:
Subscribe to Oneindia Telugu

తిరుపతి: 'సైబర్‌ బాంబ్‌' రాన్సమ్‌వేర్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలని ఇంటర్నెట్‌ యూజర్లను ఏపీ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వంద దేశాలను గడగడ వణికించిన 'వన్నా క్రై'వైరస్ ను అడ్డుకోవడంపై తిరుపతి అర్బన్ ఎస్పీ ఆర్ జయలక్ష్మి దృష్టి సారించారు.

ఈ నేపథ్యంలో సైబర్ దాడి గురించి జిల్లా వ్యాప్తంగా పోలీసు యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. తిరుపతిలోని పోలీస్ కాన్ఫరెన్స్ హాల్‌లో అర్బన్ జిల్లా వ్యాప్తంగా కంప్యూటర్ ఆపరేటర్లను పిలిపించి హ్యాకింగ్ వైరస్ గురించి అవగాహన కల్పించారు.

మీ కంప్యూటర్ లో ఇలాంటి ఫైల్స్ కనిపిస్తున్నాయా? ఓపెన్ చేస్తే.. ఇంతే సంగతులు!

Don't open any file which comes with the name 'Dance of the Hillary'

సైబర్ దాడులను ఎలా ఎదుర్కోవాలి అనే విషయంపై సైబర్ నిపుణులతో శిక్షణ ఇప్పించారు. ఈ సందర్భంగా ప్రజలకు ఏపీ పోలీసులు ఓ హెచ్చరిక జారీ చేశారు. Dance of the Hillary పేరుతో ఓ వీడియోను సృష్టించి, అందులో వైరస్‌ను చొప్పించారని పేర్కొన్నారు.

సదరు వీడియోను ఓపెన్ చేస్తే మొబైల్ ఫార్మాట్ అయిపోయి.. డేటా మొత్తం మాయం అవుతుందని, ఈ విషయాన్ని బీబీసీ రేడియోలో ఈ రోజు ప్రకటించారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. 'డాన్స్ ఆఫ్ హిల్లరీ' పేరుతో వచ్చే ఎలాంటి ఈ-మెయిల్, ఇతర ఫైల్స్‌ను ఓపెన్ చేయకూడదని సూచించారు.

కేరళ, కోల్ కతాలోని కంప్యూటర్లకు వైరస్...

కేరళ వేనాడు లో ఉన్న ఓ పంచాయతీ కార్యాలయంలోని నాలుగు కంప్యూటర్లలోకి ఈ 'వన్నా క్రై'వైరస్ ర్యాన్సమ్ వైరస్ చొరబడినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియగానే సైబర్ నిపుణుల బృందం, పోలీసులు అక్కడికి చేరుకుని కంప్యూటర్లను పరిశీలించారు.
అలాగే పశ్చమ బంగా రాష్ట్ర విద్యుత్తుశాఖ బోర్డు కంప్యూటర్లలోకి ఈ 'వన్నా క్రై'వైరస్ చొరబడినట్లు తెలుస్తోంది. వెస్ట్ మిద్నాపూర్‌లో కొన్ని కంప్యూట‌ర్ల‌ తెరపై కూడా ఈ వైర‌స్ క‌నిపించింది. మిద్నాపూర్‌లోని బెల్దా, దాత‌న్‌, నారాయ‌ణ్‌ఘ‌ర్‌, కేషియారి బ్లాక్‌లో 'వన్నా క్రై'వైర‌స్ వ‌ల్ల కంప్యూట‌ర్లు ప‌నిచేయ‌లేదు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Tirupati Urban SP R.Jayalakshmi arranged a special awarness meeting at Tirupati Police conference hall by Cyber Security Professionals about Ransomeware virus with computer operators. She told them not to open any file or e-mail when it comes to Mobile phones with the name of 'Dance of the Hillary'.
Please Wait while comments are loading...