దీని కోసమా, అడ్డుపడకు: పవన్ కళ్యాణ్‌కు రావెల, 'భూసేకరణ చట్టం ప్రయోగిస్తున్నాం'
గుంటూరు: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభివృద్ధికి అడ్డు తగలవద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు గురువారం హితవు పలికారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో తాము పవన్ సూచనలు, సలహాలు పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.
ఏపీలో 21వ శతాబ్దపు రాజధానిని తాము నిర్మిస్తామని చెప్పారు. రాజధాని కోసం ఇప్పటి వరకు 33వేల ఎకరాలు సేకరించామని చెప్పారు. మిగతా భూమిని భూసేకరణ చట్టం ద్వారా సేకరిస్తామని చెప్పారు. మూడు వేల ఎకరాల కోసం రాద్ధాంతం ఎందుకని ప్రశ్నించారు.
పవన్ కళ్యాణ్ విలువైన సూచనలు ఇస్తే తాము తప్పకుండా స్వీకరిస్తామన్నారు. రైతులు స్వచ్ఛంధంగా మూడు వేల ఎకరాలు ఇచ్చారని, ఇంకా మూడువేల ఎకరాలు మాత్రమే అవసరమన్నారు. ప్రాజెక్టులు, రోడ్లు, సెజ్‌ల నిర్మాణం కోసం భూసేకరణ కొత్త కాదన్నారు. రాజధాని నిర్మాణానికి పవన్ సహకరించాలని కోరారు.

భూసేకరణ చట్టం ప్రయోగిస్తున్నాం: పత్తిపాటి
ఆంధ్రప్రదేశ్ రాజధానికి అవసరమైన భూమి కోసం భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తున్నామని మంత్రి పత్తిపాటి పుల్లారావు వేరుగా చెప్పారు. ఐదు రోజుల తర్వాత 1500 ఎకరాల్లో భూసేకరణ చేపడతామన్నారు. తాము పవన్ కళ్యాణ్‌కు నచ్చజెబుతామన్నారు. పది నెలలుగా రాజధాని పైన పలు పోరాటాలు జరిగాయని ప్రజలు వాటిని విశ్వసించలేదన్నారు.
ఐదు రోజుల తర్వాత తుళ్లూరులో భూసేకరణ ప్రారంభిస్తామని చెప్పారు. భూసేకరణ చట్టం నిమిత్తం ఇవాళ ప్రభుత్వం నుంచి కలెక్టర్‌కు నివేదిక పంపిస్తున్నామని చెప్పారు.కలెక్టర్‌కు ప్రతిపాదనలు అందిన తర్వాత 24 గంటల్లో భూసేకరణ నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పారు.












Click it and Unblock the Notifications