డబుల్ గేమ్: జగన్‌ను కలిసిన తర్వాతే రిజైన్ అని సబ్బం

పార్లమెంటు సభ్యత్వానికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని స్పీకర్ మీరా కుమార్‌ను కోరినట్లు ఆయన తెలిపారు. పార్లమెంటు శీతాకాలం సమావేశాల లోగా రాజీనామాలను ఆమోదిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
సమైక్య రాష్ట్రం కోసం రెండు నెలలుగా ఉద్యమిస్తున్న ప్రజల్లోనే ఉండి కేంద్రం మెడలు వంచుతామని ఆయన అన్నారు. రెండు రోజుల్లో తాను జగన్‌ను కలుస్తానని, జగన్‌తో చర్చించిన తర్వాత కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు.
రాజీనామాలకు ఇది సరైన సమయం కాకున్నా ప్రజల మనోభావాలను గౌరవించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ప్రజలతో కలిసి ఉద్యమించడానికి లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యలను తాము పట్టడం లేదని ఆయన అన్నారు. మరో ముగ్గురు ఎంపీలు రాజీనామా చేసే అవకాశం ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications