ఏడుగురి అరెస్టు: గంజాయి రవాణాలో తల్లీకూతుళ్లు

వరంగల్: వరంగల్ జిల్లా హసన్‌పర్తి మండలం భీమారం కేంద్రంగా ఇతర రాష్ట్రాలకు గంజాయి ఎగుమతి చేస్తున్న ఏడుగురిని కాకతీయ యూనివర్సిటీ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 128 కిలోల శీలావతి గంజాయి, 3 ద్విచక్రవాహనాలు, 6 సెల్‌ఫోన్‌లు, రూ.28.500 నగదును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం పోలీసు స్టేషన్‌లో మీడియా ముందు నిందుతులను ప్రవేశపెట్టారు. 10లక్షల విలువైన గంజాయిని, వారు ఉపయోగించిన వాహనాలను ప్రదర్శించారు. హన్మకొండ డీఎస్పీ దక్షిణామూర్తి అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

వర్ధన్నపేట మండలం రాందాన్‌నాయక్‌ తండాకు చెందిన గుగులోత్‌ హీరాలాల్‌ కాజీపేట ఆర్‌ఈసీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. దర్గా కాజీపేటకు చెందిన పూజారి కుమరస్వామి, హీరాలాల్‌ మంచి స్నేహితులు. గతంలో వీరు పలుమర్లు ఇతర జిల్లాలతోపాటు, ఇతర రాష్ట్రాలలో గంజాయి కేసులలో జైలు జీవితం గడిపారు. సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా పోలీ సు తనిఖీలు ఎక్కువవడంతో వ్యాపారాన్ని నిలిపివేసినట్టు డీఎస్పీ చెప్పారు.

Drugs supply: Seven arrested

ఇటీవల కాలంలో ఇన్నోవా వాహనంలో అనకాపల్లి, విశాఖ‌, చోడవరం, పాడేరు, మడుగుల ప్రాంతాల నుంచి గంజాయి సాగుచేసే రైతుల నుంచి గంజాయి కొనుగోలు చేసి జిల్లాకు తరలిచేవారు. ఆరు నెలల క్రితంనుంచి వీరి వ్యాపారం విస్తరించింది. ఇన్నోవా వాహనానికి డైవర్లుగా పరకాలకు చెందిన నరెడ్ల సతీష్‌, మల్లారెడ్డిపల్లికి చెందిన రౌతు రాజేష్‌ పనిచేస్తున్నారు. వీరు కొనుగోలు చేసి తెచ్చిన గంజాయి ముడిసరుకును భీమరం గ్రామనికి చెందిన రాజూరి విజయ ఇంట్లో ప్యాకింగ్‌ చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తారు.

విజయకు భర్త లేకపోవడంతో అక్రమ సంపాదన కోసం ఇద్దరు కుమర్తెలు సునీత, మరో కూతురు బాలికను అక్రమ వ్యాపారానికి పురికొల్పింది. సునిత స్కూటీపై వరంగల్‌, కాజీపేట రైల్వే స్టే షన్‌లలో కొందరికి చిల్లర గంజాయిని అందించేదని విచారణలో తేలినట్టు పేర్కొన్నారు. ఈ స్థితిలో భీమరంలో హీరాలాల్‌, కుమరస్వా మి, సతీష్‌, రాజేష్‌ తెచ్చిన బస్తాలకొద్ది గంజాయిని రాత్రివేళల్లో రహస్యంగా ప్యాకింగ్‌ చేస్తు న్నట్టు సమచారం అందింది.

సోమవారం విజయ ఇంట్లో గంజాయిని ఇత ర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు ప్యాకింగ్‌ చేస్తుండగా పట్టుకున్నారు. పోలీసులు పట్టుకున్న గంజాయి విలువ సుమ రు రూ. 10లక్షల వరకు ఉంటుందని పోలీసులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+