నేటి నుంచే ఏపీలో DSC పరీక్షలు.. ఒక్క నిమిషం లేట్ అయిన అంతే !

ఆంధ్రప్రదేశ్‌‌లో నేటి నుంచి మెగా డీఎస్సీ (Mega DSC) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు ( జూన్ 6, 2025 ) నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఈ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

పరీక్షా కేంద్రాలు..

ఈసారి డీఎస్సీకి దరఖాస్తులు భారీగా వచ్చాయి. మొత్తం 5.7 లక్షలకుపైగా దరఖాస్తులు అందగా.. 3.35 లక్షల మంది అభ్యర్థులు మాత్రమే హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నట్టు సమాచారం. అభ్యర్థులు అధిక సంఖ్య కారణంగా రాష్ట్రం మాత్రమే కాకుండా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా రాష్ట్రాల్లోనూ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇక ఈ పరీక్ష కోసం ఏపీ వ్యాప్తంగా మొత్తం 154 కేంద్రాలు ఏర్పాటు చేశారు.

dsc-exams-starting-from-today-in-andhra-pradesh

పరీక్ష సమయం..

రోజుకు రెండు సెషన్లుగా ఎగ్జామ్ నిర్వహించనున్నారు. ఉదయం 9:30 గంటల నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్.. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. అభ్యర్థులు పరీక్షకు కనీసం గంటన్నర ముందు కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఒక్క నిమిషం ఆలస్యం అయినా పరీక్షా హాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. అలానే రెండు చేతులు లేని అభ్యర్థులు, దృష్టిలోపం ఉన్నవారికి ప్రత్యేకంగా సహాయకుల సదుపాయం అందిస్తున్నారు.

కీలక నిబంధనలు..

అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ తీసుకురావాల్సి ఉంటుంది. అంతే కాకుండా హాల్ టికెట్‌పై ఫోటో లేకపోతే.. రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకురావాలని అధికారులు వెల్లడించారు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి వంటి గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి తీసుకురావాలని సూచించారు.

పోస్టుల వివరాలు..

ఈ మెగా డీఎస్సీ ద్వారా పలు ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT), పీఈటీ, లాంగ్వేజ్ పండిట్, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ సహా సంబంధిత పోస్టులు ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+