నేను సీఎం కాదు, పవన్ కళ్యాణ్ సీరియస్..!!

డిప్యూటీ సీఎం పవన్ కీలక వ్యాఖ్యలు చేసారు. కోనసీమ కొబ్బరి రైతులకు శాశ్వత పరిష్కారం కావాలని ఆకాంక్షించారు. రైతుల నుంచి వారి సమస్యల పై ఆరా తీసారు. గత ప్రభుత్వంలో అభివృద్ధి మరచిపోయారని, ఓట్లు కోసమో, హడావుడి చేయడానికి ఇక్కడికి రాలేదన్నారు. కోనసీమ రైతాంగం గళం అవుతానని చెప్పారు. వరాలు ఇవ్వడానికి తాను సీఎం కాదని.. ఆయన దృష్టికి సమస్యలు తీసుకుని వెళ్తానని.. డిసెంబర్ రెండో వారంలో మళ్ళీ వస్తానని తెలిపారు. ఇదే సమయంలో అధికారుల పైన పవన్ సీరియస్ అయ్యారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటించారు. ఈ సందర్భంగా రైతులతో సమావేశం అయ్యారు. వారి సమస్యలను విని.. పరిష్కరిస్తానని భరోసా కల్పించారు. కోనసీమ రైతులకు గళామవుతా..గొంతువవుతానని ధైర్యం చెప్పారు. శంకరగుప్తం డ్రైన్‌తో తాగునీటి జలాలు ఉప్పు మయంగా మారాయని వివరించారు. జిల్లాలో డ్రైన్ ఆధునికీకరణకు రూ.4వేల కోట్లు అవసరమని తెలిపారు.

DY CM Pawan Kalyan key assurance for Konaseema Coconut Farmers

అంబేద్కర్ కోనసీమ జిల్లా అన్నదాతల సమస్యలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని మాటిచ్చారు. రైతులు అధైర్యపడవద్దని ధైర్యం చెప్పారు. డిసెంబరు రెండో వారంలో రైతన్నలతో మరోసారి సమావేశం నిర్వహిస్తానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. సర్వీస్ రూల్స్ లేకుండా సచివాలయం ఉద్యోగులు విషయంలో గత ప్రభుత్వంలో ప్రవర్తించిందని విమర్శించారు. ప్రజలను మభ్య పెట్టడానికి తాను రాలేదని చెప్పారు.

కాగా, గత సీఎంలా తన దగ్గర డబ్బులు లేవని, కోనసీమ కొబ్బరి రైతులకి శాశ్వత పరిష్కారం కావాలని మూలాలు తెలుసుకోవాలని చెప్పారు. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై అధికారులను సున్నితంగా పవన్ కల్యాణ్ హెచ్చరించారు. ఈ క్రమంలో శంకరగుప్తం డ్రైన్ సమస్యపై తన పేషీ అధికారులు ఇచ్చిన నివేదికను చదివి వినిపించారు పవన్ కల్యాణ్. కోనసీమ కొబ్బరి రైతుల సమస్యపై అధికారులకు పూర్తి అవగాహన ఉండాలని సూచించారు.

DY CM Pawan Kalyan key assurance for Konaseema Coconut Farmers

శంకర్ గుప్తం డ్రైయిన్‌కు ఉన్న ఆక్రమణలపై అధికారులు ఎందుకు దృష్టి పెట్టలేదని ప్రశ్నించారు. గతంలో ఇరిగేషన్ నిపుణుడు రోశయ్య కమిటీ ఇచ్చిన నివేదికను ఎందుకు పక్కన పెట్టేశారని నిలదీశారు. డిసెంబరు రెండో వారంలో ఇదే సమస్యపై రైతులతో మరోసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు సంక్రాంతి పండుగ తర్వాత కోనసీమలో డ్రైనేజీ వ్యవస్థ ప్రక్షాళన కోసం యాక్షన్ ప్లాన్ ప్రారంభించాలని అధికారులను పవన్ ఆదేశించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+