ఒక రోజు మొత్తం కేటాయిస్తా, నాదీ భరోసా - పవన్..!!
స్టీల్ ప్లాంట్ బాధితులను డిప్యూటీ సీఎం పవన్ పరామర్శించారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కార్మికుల సమస్యలను అధ్యయనం చేయటంతో పాటుగా పరిష్కార మార్గాల పైన చర్చ కోసం ఒక రోజు సమయం పూర్తిగా కేటాయిస్తామని భరోసా కల్పించారు. ప్లాంట్ ను ఆధునీకరించాల ల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ప్రమాదం పైన విచారణ కమిటీ నివేదిక మేరకు తదుపరి చర్యలు ఉంటాయని పవన్ పేర్కొన్నారు.
విశాఖ స్టీల్ ప్రమాద బాధితులను పవన్ పరామర్శించారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనపై త్రిసభ్య కమిటీ దర్యాప్తు చేస్తుందని తెలిపారు. ప్రమాదానికి ముందే.. మరో ఘటన జరిగిందని కార్మికులు చెప్పారన్నారు. ఇలాంటి ఘటన గత 33 ఏళ్లలో ఎప్పుడూ జరగలేదన్నారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విశాఖ ఉక్కు ప్రైవేట్‌పరం కాకూడదన్నదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. ఇలాంటి ప్రమాదాలు జరగకుండా నిరంతర నిఘా ఉండాలన్నారు. విచారణ కమిటీ నివేదిక వచ్చాక చర్యలు తీసుకోనున్నట్లు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. విశాఖ కిమ్స్ ఆస్పత్రిలో స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటనలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను పరామర్శించారు.

బాధితులకు అండగా నిలుస్తాం
కిమ్స్‌కు చేరుకున్న పవన్.. బాధితులను, వారి కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆసుపత్రిలో అందుతున్న చికిత్సకి సంబంధించిన వివరాలను వైద్యులను అడిగి తెలుసుకు న్నారు. వైద్యానికి అయ్యే ఖర్చులు మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, అన్ని విధాలా అండగా ఉంటామని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీల న చేసి ఘటన పైన ఆరా తీసారు. ఇప్పటికే కేంద్రం బాధితులకు పరిహారం ప్రకటించిందని.. వారి కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు తిరిగి జరగ కుండా అన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. త్వరలోనే తాను మరోసారి స్టీల్ ప్లాంట్ అంశాల పైన చర్చించేందుకు వస్తానని పవన్ హామీ ఇచ్చారు.













Click it and Unblock the Notifications