Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సీన్ రివర్స్- ఢిల్లీ రిపోర్ట్స్ తో పవన్ అనూహ్య నిర్ణయం..!!

ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంటోంది. టీడీపీ మహానాడు ద్వారా పార్టీలో జోష్ పెంచే ప్రయత్నం చేసింది. పాలనలో - పార్టీ పరంగా కీలక నిర్ణయాలకు సిద్దం అయింది. బీజేపీ కూటమి పై తమ పట్టు పెంచుతోంది. తాము అనుకున్న విధంగా పదవులు దక్కించుకుంటోంది. ఇక, జనసేన లో మాత్రం పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. పార్టీ సమీక్షలు కరువయ్యాయి. ఎమ్మెల్యేల పైన ఆరోపణలు పెరుగుతు న్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ సన్నిహితులు పవన్ ను అప్రమత్తం చేసినట్లు సమాచారం. దీంతో, పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఎమ్మెల్యేల పై ఫిర్యాదు
2024 ఎన్నికల్లో కూటమి విజయం లో పవన్ కీలక పాత్ర పోషించారు. కూటమి 164 సీట్లు గెలవ గా, జనసేన పోటీ చేసిన 21 స్థానాలను దక్కించుకుంది. ఈ ఏడాది కాలంలో పవన్ పార్టీ ప్లీనరీ లో మినహా.. పార్టీ బలోపేతం పైన ప్రత్యేకంగా సమయం కేటాయించ లేదు. ఇక.. జనసేన నుంచి ముగ్గురు కేబినెట్ లో మంత్రులుగా ఉన్నారు. గోదావరి జిల్లాలతో సహా పోటీ చేసిన ప్రతీ చోటా జనసేనకు ప్రజలు మద్దతుగా నిలిచారు. అయితే, కొంత కాలంగా పార్టీ ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ఆరోపణలు వస్తున్నాయి. పవన్ వారిని నియంత్రించక పోతే భారీ నష్టం తప్పదని ఢిల్లీ లోని సన్నిహితుల ద్వారా నివేదికలు అందినట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో, పవన్ పార్టీలో దారి తప్పిన ఎమ్మెల్యేల తీరు పైన ఫోకస్ చేసారు. సర్వే చేయిస్తున్నారు. పూర్తి సమాచారం ఆధారం గా అవసరమైన నిర్ణయాలకు సిద్దం అవుతున్నారు.

Dy CM Pawan seek detailed report on own party MLAS performance details here

ఎమ్మెల్యేలపై సర్వే
పలు నియోజకవర్గాల్లో అవినీతి పెరిగిందనే ఆరోపణలు తారా స్థాయికి చేరాయి. ఎమ్మెల్యేలు అవినీతిలో భాగ స్వాములు అవుతున్నారంటూ పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. కూటమికి పట్టం కట్టిన గోదావరి జిల్లాల్లో ఈ చర్చ ఎక్కువగా వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యేల పైన ఆరోపణలు వస్తున్నాయి. దీంతో, పవన్ ఈ వ్యవహారం లో ఎమ్మెల్యేలు ఎవరెవరు ఉన్నారనే కోణంలో ఆరా తీసినట్లు విశ్వసనీయ సమాచారం. అదే విధంగా ఏడాది కాలంలో వారి పని తీరుతో పాటుగా ఈ ఆరోపణల పైన పవన్ పూర్తి నివేదిక సిద్దం చేస్తున్నారు. ఎమ్మెల్యేల పై సీరియస్ జనసేన ఎమ్మె ల్యేలు కొందరి పైన వస్తున్న ఆరోపణల పై పవన్ సీరియస్ గా ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో, జనసేన ఎమ్మెల్యేల పనితీరు.. వ్యవహార శైలి పై పవన్ ప్రత్యేక సర్వే చేయిం చాలని నిర్ణయించారు. ఇప్పటికే ప్రాధమిక సమాచారం సేకరించారు.

అలర్ట్ కాకుంటే నష్టమే
జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో వారి కుటుంబ సభ్యుల జోక్యం.. ఇసుక, మద్యం లావాదేవీల్లో ప్రమేయం వంటి అంశాల పైన పూర్తి సమాచారంతో నివేదికలను ప్రముఖ సర్వే సంస్థ నుంచి సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో జనసేన ఎమ్మెల్యేల పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీంతో, పవన్ అలర్ట్ అయ్యారు. ఆ సర్వే సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా జూన్ మూడో వారం లో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశానికి పవన్ నిర్ణయించినట్లు సమాచారం. అవినీతి.. బంధు ప్రీతి ఆరోపణలు ఉన్న ఎమ్మెల్యేల పైన కఠిన చర్యల దిశగా పవన్ సిద్దం అవుతున్నట్లు పార్టీ నేతల్లో చర్చ జరుగుతోంది. దీంతో, పవన్ ఆరోపణలు నిజమని తేలితే ఎలాంటి చర్యలకు సిద్దం అవుతారనేది పార్టీలో ఉత్కంఠ పెంచుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+