విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు ప్రజలకు శుభవార్త
ప్రయాణికుల అదనపు రద్దీని తగ్గించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే వేసవి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సంబల్ పూర్ నుంచి కాచిగూడ వరకు నడిచే రైళ్లు దువ్వాడ మీదగా ప్రయాణిస్తాయి. ఈనెల 13వ తేదీ నుంచి జూన్ 24వ తేదీ వరకు ప్రతి సోమవారం రాత్రి 9.00 గంటలకు సంబల్పూర్ లో బయలుదేరుతుంది. తర్వాతరోజు తెల్లవారుజామున 3.30 గంటలకు రాయగడ చేరుకొని 3.35 గంటలకు బయలుదేరుతుంది. విజయనగరంకు 5.30, దువ్వాడకు 7.20 గంటలకు చేరుకొని అక్కడి నుంచి 7.25 గంటలకు బయలుదేరి వెళుతుంది. రాత్రి 9.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణంలో ఈనెల 14 నుంచి జూన్ 25 వరకు ప్రతి మంగళవారం రాత్రి 11.20 గంటలకు కాచిగూడలో బయలుదేరి తర్వాత రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. 12.35 గంటలకు బయలుదేరి రాత్రి 11.45 గంటలకు సంబల్ పూర్ చేరుకుంటుంది. ఇందులో థర్డ్ ఏసీ ఒక బోగీ, స్లీపర్ 15, జనరల్ 4, లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్, దివ్యాంగులకు ఒక బోగీ, జనరేటర్ మోటార్ కార్లు ఉంటాయి. మార్గమధ్యంలో బార్ఫర్ రోడ్డు, బలంగీర్, టిట్లాగడ్, కేసింగ, మునిగూడ, రాయగడ, పార్వతీపురం, బొబ్బిలి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, దువ్వాడ, అనకాపల్లి, తుని, పిఠాపురం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, విజయవాడ, గుంటూరు, నడికుడి, మిర్యాల గూడ, నల్గొండ, చెర్లపల్లి, మల్కాజిగిరి లో హాల్టింగ్ ఉంది.

వేసవి రద్దీని దృష్టిలో ఉంచుకొని భారతీయ రైల్వే దేశవ్యాప్తంగా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లల్లో ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఛార్జీలు అధికంగా వసూలు చేయడంతోపాటు సమయానికి కూడా ఇవి గమ్యస్థానాలకు చేరుకోవడంలేదు. రోజువారీగా తిరిగే రైళ్లు వస్తున్నప్పుడు వాటికి క్రాసింగ్ ఇవ్వడం కోసం గంటల తరబడి ఎక్కడ పడితే అక్కడే నిలిపేస్తున్నారంటూ రైల్వే యూజర్స్ అసోసియేషన్ నాయకులు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications