రాజమండ్రిలో భారీ అగ్నిప్రమాదం...60 పూరిళ్లు దగ్ధం;భారీగా ఆస్థి నష్టం
తూర్పుగోదావరి:రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు జంగాల కాలనీలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 60 పూరి గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి.
తెల్లవారుజామున ఈ ప్రమాదం సంభవించడంతో బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటల అదుపు చేసేలోగానే పూరిళ్లు కావడంతో దగ్థమైపోయాయి. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. దీంతో ఈ అగ్నిప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం లేకున్నా భారీగా ఆస్తినష్టం సంభవించింది. ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్క్యూట్ చోటుచేసుకున్న కారణంగానే మంటలు వ్యాపించినట్లు భావిస్తున్నారు.













Click it and Unblock the Notifications