Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఉపఎన్నికలపై హైకోర్టుకు ఈసీ క్లారిటీ..! పులివెందులపై గవర్నర్ కు వైసీపీ ఫిర్యాదు..!

ఏపీలో ఈ నెల 10న జరిగే స్థానిక సంస్థల ఉపఎన్నికల వ్యవహారం రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికల్ని అధికార కూటమితో పాటు వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో క్షేత్రస్ధాయిలో మాటల యుద్ధం కాస్తా దాడుల వరకూ వెళ్లిపోతోంది. ఈ నేపథ్యంలో హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన రిట్ పిటిషన్ పై స్పందించిన ఈసీ క్లారిటీ ఇచ్చింది. అదే సమయంలో గవర్నర్ వద్దకు వెళ్లి వైసీపీ నేతలు పులివెందులలో తాజా దాడులపై ఫిర్యాదు చేశారు.

కడపజిల్లాలో స్థానిక సంస్థల ఉప ఎన్నికల సందర్భంగా టీడీపీ దాడులపై, అధికారపార్టీకి అండగా నిలుస్తున్న పోలీస్ యంత్రాంగంపై వైసీపీ ప్రతినిధి బృందం గవర్నర్‌ అబ్ధుల్ నజీర్‌ను కలిసి ఫిర్యాదు చేసింది. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ నేతృత్వంలో పలువురు నాయకులు గవర్నర్‌ను కలిశారు. ఈ సందర్బంగా పులివెందుల్లో టీడీపీ శ్రేణులు పట్టపగలు మారణాయుధాలతో దాడులు చేయడం, వాహనాలను ధ్వంసం చేయడం, వైసీపీ నేతలను హతమార్చేందుకు ప్రయత్నించిన తీరు, పోలీసులు పట్టించుకోకుండా అధికార పార్టీకి ఎలా అండగా నిలిచారో ఆధారాలతో గవర్నర్‌కు వివరించారు.

ec informs hc of steps taken to hold local bodies byelection ysrcp complains governor against tdp

అనంతరం మీడియాతో మాట్లాడిన వైసీపీ నేత బొత్స సత్యనారాయణ... ఎమ్మెల్సీ, బీసీ నేత రమేష్ యాదవ్‌ కు కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత పోలీసులపై లేదా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే పోలీసులు దాడి జరుగుతుంటే, పట్టించుకోకుండా ఉన్నారన్నారు. కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఈ ఘటనపై చేసిన వ్యాఖ్యలు చూస్తేనే ఇది అర్థమవుతోందన్నారు. ఆయన మాటలను కూడా గవర్నర్‌ గారి దృష్టికి తీసుకువెళ్ళినట్లు తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయని, తక్షణం గవర్నర్‌ దీనిపై దృష్టి సారించాలని కోరినట్లు వెల్లడించారు.

ec informs hc of steps taken to hold local bodies byelection ysrcp complains governor against tdp

మరోవైపు స్ధానిక సంస్థల ఉపఎన్నికలపై హైకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ పై స్పందించిన ఈసీ.. తాము తీసుకున్న చర్యల్ని వివరించింది. ఉప ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా , శాంతియుతంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషన్ హైకోర్టుకు తెలిపింది. సిసిటివి నిఘా, వెబ్‌కాస్టింగ్, పోటీ చేసే అభ్యర్థులకు పోలీసు రక్షణ, స్వతంత్ర పరిశీలకుల నియామకం, కంట్రోల్ రూమ్‌లు, పూర్తి వీడియో డాక్యుమెంటేషన్ చేయాలని వైసీపీ కోరగా.. ఆయా చర్యలు తీసుకున్నట్లు ఈసీ హైకోర్టుకు తెలిపింది. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ను డిస్పోజ్ చేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+