లగడపాటికి ఈసి నోటీసు: ఉత్తమ్ కుమార్ రెడ్డిపై కేసు

హైదరాబాద్: సర్వే పేరిట హడావుడి చేసిన పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజ్‌గోపాల్‌కు ఎన్నికల ప్రధానాధికారి నోటీసు జారీ చేశారు. తెలంగాణలో తెరాస, సీమాంధ్రలో తెలుగుదేశం- బిజెపి కూటమి, కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వస్తుందని తన సర్వేలో తేలినట్టు లగడపాటి రాజ్‌గోపాల్ శనివారం ప్రకటించారు.

ఇది ఎన్నికల నిబంధనకు విరుద్ధమని, ఇలాంటి సర్వేలు ప్రకటించవద్దని ఎన్నికల సంఘం ముందుగానే ఆదేశించింది. అయినా లగడపాటి దీనికి విరుద్ధంగా సర్వే ప్రకటించారు. లగడపాటికి నోటీసు జారీ చేశామని, ఆయన చెప్పిన సర్వేను ప్రసారం చేసిన 10 టీవీ చానళ్లకూ నోటీసులు ఇచ్చినట్టు ఎన్నికల ప్రధానాధికారి భన్వర్‌లాల్ ఆదివారం వెల్లడించారు. మే 16 చివరి విడత పోలింగ్ ముగిసేంత వరకూ ఇలాంటి సర్వేలు ప్రకటించవద్దనే నిబంధన ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు.

EC issues notice to Lagadapati Rajagopal

నల్లగొండ జిల్లాలో తెలంగాణ పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కారులో రెండున్నర కోట్లు తరలిస్తున్నట్టు వచ్చిన ఫిర్యాదుపై పోలీసు విచారణకు భన్వర్‌లాల్ ఆదేశించారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఈ వ్యవహారంలో నోటీసు ఇవ్వాలని డిజిపిని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఆయనపై కేసు పెట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది.

నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద బాయ్‌నెట్ ఇంజన్‌లో డబ్బులు కాలిపోవడంతో విషయం బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగింది. డబ్బులు కాలిన కారు ఉత్తమ్ కుమార్ రెడ్డి కంపెనీ పేర రిజిష్టరై ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+