వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్థిక సర్వే: నీతి అయోగ్ గోల్స్‌లో ముందంజ, నిధులు పొందిన రాష్ట్రాల్లో ఏపీ నంబర్ వన్

|
Google Oneindia TeluguNews

ఆర్థిక సర్వేను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశం మొత్తానికి సంబంధించి చేపట్టిన సర్వేలో.. ఆంధ్రప్రదేశ్ సంబంధిత అంశాల వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నీతి ఆయోగ్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ గోల్స్‌లో ముందంజలో ఉంది. 72 స్కోర్‌తో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. కేరళ 75 స్కోరుతో మొదటి స్థానంలో నిలిచింది.

నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద 2020-21లో అత్యధిక నిధులు పొందిన రాష్ట్రాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్ సేవా రంగంలో స్వల్పంగా వెనుకబడింది. పంటమార్పిడి కార్యక్రమంలో భాగంగా పొగాకుకు ప్రత్యామ్నాయ పంట సాగుగా వ్యవహరిస్తోంది. ఏపీతో సహా బీహార్, గుజరాత్, తెలంగాణ మరికొన్ని రాష్ట్రాల్లో 2021-22 నుంచి దీనిని అమలు చేస్తున్నారు. కరోనా మహమ్మారి కంటే ముందు నాటి పరిస్థితులతో పోల్చితే గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేసే పనుల శాతం ఏపీలో తగ్గుముఖం పట్టాయి. ఏపీలో సంతానోత్పత్తి రేటు.. 2015-16లో 1.8 ఉండగా, 2019-21లో 1.7కు తగ్గిపోయింది. ఏపీలో స్త్రీ, పురుష నిష్పత్తిలో కాస్త వృద్ధి కనిపించింది. ప్రతి వెయ్యి మంది పురుషులకు గతంలో 914 ఉండగా, ఇప్పుడు 934 మంది స్త్రీలకు పెరిగారు.

Economic Survey 2022: niti aayog sustainable development goal 4th place in andhra pradesh

తొలి ఆర్థిక సర్వేను 1950-51లో ఆవిష్కరించారు. ఆర్థిక సర్వే రెండు వాల్యూమ్స్‌లో ఉంటుంది. తొలి వాల్యూమ్‌లో ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లు ఉంటాయి. రెండో వాల్యూమ్‌లో ఆర్థిక వ్యవస్థకు చెందిన గత ఆర్థిక సంవత్సరపు రివ్యూ ఉంటుంది. ఇంకా ప్రభుత్వ స్కీమ్స్, పాలసీల గురించి వివరంగా తెలుసుకోవచ్చు. ఆర్థిక సర్వే చాలా కీలకమని చెప్పుకోవాలి. దేశ ఆర్థిక వ్యవస్థ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఈ డాక్యుమెంట్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనీ సప్లై, అగ్రికల్చర్, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఉపాధి, ఎగుమతులు, దిగుమతులు, ఫారిన్ ఎక్స్చేంజ్ ఇలా పలు వాటికి సంబంధించిన ట్రెండ్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన ఏపీ మాత్రం అభివృద్దిలో దూసుకువెళ్తుంది. విదేశీ కంపెనీలను ఆకట్టుకోవడం.. వారికి సరయిన మౌళిక వసతులు కల్పించడంతో.. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు.

English summary
Economic Survey 2022: niti aayog sustainable development goal 4th place in andhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X