ఎంపీ మాగుంట కుమారుడిని అరెస్ట్ చేసిన ఈడీ..!!

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎంపీ మాగుంట తనయుడు రాఘవరెడ్డిని ఈడీ అరెస్ట్ చేసింది.

వైసీపీ ఎంపీ కుమారుడిని ఈడీ అధికారులు అరెస్ట్ చేసారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కొంత కాలంగా ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుమారుడు మాగుంట రాఘవ ప్రమేమం పై ఆరోపణలు ఉన్నాయి. బలాజీ గ్రూపు యజమానిగా రాఘవ ఉన్నారు. ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లోనూ రాఘవ పేరు నమోదు చేసింది. లిక్కర్ స్కాంలో తమకు.. తన కుమారుడికి ప్రమేయం లేదని ఎంపీ మాగుంట ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసారు.

అయితే, సీబీఐ వరుసగా చేస్తున్న అరెస్టుల్లో భాగంగా ఇప్పుడు మాగుంట రాఘవను అరెస్ట్ చేసారు. రాఘవ వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దం అవుతున్న సమయంలో ఇప్పుడు ఈ కేసు వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్

ఎంపీ మాగుంట కుమారుడు అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో ప్రకపంనాలకు కారణమవుతున్న ఢిల్లీ లిక్కర్ స్కాంలో మరో అరెస్ట్ జరిగింది. వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవ ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ మధ్నాహ్నం కోర్టులో హాజరు పర్చనున్నారు. సౌత్ గ్రూపు నుంచి విజయ్ నాయర్ ద్వారా ఆప్ పార్టీకి ముడుపులుగా అందించారనే అభియోగాల్లో భాగంగా రాఘవ విచారణ ఎదుర్కొంటున్నారు.

సౌత్ గ్రూపు నుంచి నలుగురిని అరెస్ట్ చేసారు. రెండు రోజులుగా రాఘవను ఈడీ అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు. తమ విచారణకు రాఘవ సహకరించటం లేదనేది ఈడీ అధికారుల అభియోగం. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్. కొంత కాలంగా ఈడీ, సీబీఐ అధికారులు ఢిల్లీతో పాటుగా నెల్లూరు, చెన్నైల్లోనూ సోదాలు నిర్వహించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రమేయం

శరత్ చంద్రా రెడ్డి, అభిషేక్, తో పాటుగా మాగుంట రాఘవరెడ్డి కి ప్రమేయం ఉందని ఈడీ పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ పాలసీ తయారు సమయంలోనే పక్కా ప్రణాళికతోనే లిక్కర్ వ్యాపారులకు లబ్ది చేకూరేలా లావా దేవీలు నిర్వహించారనేది ఈడీ ఆరోపిస్తోంది. అందులో భాగంగా సౌత్ గ్రూపు నుంచి జరిగిన లావాదేవీల్లో రాఘవ రెడ్డి ప్రమేయ ఉందనేది ఈడీ వాదన.

ఢిల్లీలో పొందన లిక్కర్ దుకాణాల్లో రాఘవ రెడ్డికి ప్రయోజనం పొందారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక, తమపైన వస్తున్న ఆరోపణలపైన ఎంపీ మాగుంట గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మాగుంట ఆగ్రో ఫార్మ్స్‌ సంస్థలో తనకు ఎలాంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. ఉత్తరాదికి చెందిన కొందరి కుట్ర ఇందులో ఉందని కొద్ది రోజుల క్రితం మాగుంట కీలక ఆరోపణ చేసారు.

ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న వేళ

ఎన్నికల్లో పోటీకి సిద్దమవుతున్న వేళ

ఇప్పుడు ఈడీ అరెస్ట్ చేసిన మాగుంట రాఘవ రెడ్డి విచారణ సమయంలో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీలో 32జోన్లలో మద్యం టెండర్లు నిర్వహిస్తే రెండు జోన్లలో మాత్రమే మాగుంట కుటుంబానికి చెందిన ఆగ్రో ఫార్మ్స్‌ సంస్థకు రెండు జోన్లలో మాత్రమే వ్యాపారాలు దక్కాయని ఆ సంస్థలో తాను, తన కుమారుడు డైరెక్టర్లు కాదని ఎంపీ మాగుంట చెప్పారు.

తమ పై వచ్చిన లిక్కర్ ఆరోపణలు నిరాధారమైనవని ఎంపీ చెప్పపుకొచ్చారు. తాము 70 ఏళ్ల నుండి లిక్కర్ వ్యాపారం లో ఉన్నామని.. ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో తాము అసలు లేమని స్పష్టత ఇచ్చారు. ఎనిమిది రాష్ట్రాలలో తమకు వ్యాపారాలు ఉన్నాయని..తాము ఎటువంటి మచ్చలేకుండా వ్యాపారం చేస్తున్నామని వివరించారు.

ఇక, వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో తన కుమారుడు పోటీలో ఉంటారని ఎంపీ వెల్లడించారు. ఇప్పుడు రాఘవ అరెస్ట్ పైన ఎంపీ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+