గంగిరెడ్డిపై ఈడీ కేసు, ఆస్తుల జఫ్తుకు రంగం సిద్ధం!
హైదరాబాద్: అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రాష్ట్రానికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. మంగళవారం నాడు గంగిరెడ్డి పైన ఈడి (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) కేసు నమోదు చేసింది. విదేశాల నుండి హవాలా ద్వారా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరిపినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో గంగిరెడ్డికి ఆంధ్రప్రదేశ్‌తో పాటు విదేశాల్లో ఉన్న ఆస్తులపై కూడా ఈడీ ఆరా తీసింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌తో గంగరెడ్డి అక్రమంగా కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినట్లు ఈడీ గుర్తించింది. దేశవిదేశాల్లో స్మగ్లర్ గంగిరెడ్డికి ఉన్న ఆస్తుల వివరాలను ఏపీ సీఐడీ ఈడీకి అందజేసింది. అతని ఆస్తులు జఫ్తు చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.

కాగా, అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని రాష్ట్రానికి తరలించడం ఇటీవల సులభతరమైన విషయం తెలిసిందే. ఆయన మారిషస్ దేశంలో బెయిల్ కోసం సోమవారం రెండోసారి ప్రయత్నించాడు. అయితే, దాన్ని తిరస్కరిస్తూ కోర్టు ఉతర్వులు జారీచేసింది.
బెయిల్ కోసం మూడోసారి పిటిషన్ దాఖలు చేశారు. ఇంతలో ఆయనకు ఇచ్చింది తప్పుడు పాస్‌పోర్టు అని ధ్రువీకరిస్తూ సికింద్రాబాద్ పాస్‌పోర్టు కార్యాలయం దాన్ని వెంటనే రద్దుచేసింది. పాస్‌పోర్టు రద్దు చేయడంతో గంగిరెడ్డిని తీసుకురావడానికి మార్గం సుగమమైంది.












Click it and Unblock the Notifications