ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలును రద్దు చేసిన ఏపీ

ఏపీలో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేసిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి అందుకు అనుగుణంగా కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.. ఇందుకోసం ఆర్టీసీ ఉద్యోగులను సైతం ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కసరత్తు జరుగుతుంది. దీంతో ఆర్టీసీ బలోపేతం కోసం సుమారు 1000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశ పెట్టాలని జగన్ గతంలో నిర్ణయించారు. మొదటి దఫాగా అందులో 350 బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం టెండర్లు కూడ ఆహ్వానించారు. అయితే టెండర్లను కొన్ని అనివార్య కారణాలతో రద్దు చేసినట్టు తెలుస్తోంది.

ముఖ్యంగా బస్సుల కొరతతో పాటు కొన్ని చట్టపరమైన నిబంధనల వల్ల బస్సులను తీసుకునే నిర్ణయాన్ని రద్దు చేసినట్టు సమాచారం. కాగా ఎలక్ట్రిక్ బస్సులను తయారు చేసే కంపనీలు దేశంలో ఏడు కంపనీలు మాత్రమే ఉండడంతో బస్సుల కొరత ఏర్పడుతోంది.

Electric buses tender has been cancelled

మరోవైపు ఆయా కంపనీలకు ఇతర రాష్ట్రాల నుండి కూడ పెద్ద ఎత్తున అర్డర్లు ఉండడంతో బస్సుల రావడం ఆలస్యం కానున్నట్టు తెలుస్తోంది. దీనికి అదనంగా బస్సుల చార్జింగ్ యూనిట్ల కోసం భారి మొత్తంలోనే ఖర్చు పెట్టాల్సి ఉండడంతో... తాజా పరిస్థితుల్లో వాటిని భరించే అవసరం లేదని ప్రభుత్వం భావించినట్టు తెలుస్తోంది.

ఇక టెండర్ ప్రక్రియకు సంబంధించి 100 కోట్లకు పైబడిన వాటిని జ్యూడిషియల్ కమిటీ పరీశీలన తర్వాతే వాటిని అంగీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రద్దు తేవాలని భావించిన 350 బస్సుల విలువ సుమారు 700 కోట్ల రుపాయల వరకు కానుండడంతో ఈ నిర్ణయాన్ని రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+