మీటర్ కోసం వెళ్తే తల్లిని లోబర్చుకున్నాడు: కూతురిపై అత్యాచారం
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా అమరావతిలో విద్యుత్‌శాఖ ఉద్యోగి అత్యంత నీచానికి పాల్పడ్డాడు. కరెంట్‌మీటర్ కోసం విద్యుత్ కార్యాలయానికి వెళ్లిన ఓ వితంతువును సబ్ ఇంజినీర్ మాయమాటలుచెప్పి లోబర్చుకున్నాడు.
అంతటితో ఆగని కామాంధుడు ఆ వితంతువు కూతురిని బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ యువతి గర్భం దాల్చడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బాధిత మహిళ ఈ విషయంపై అమరావతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి.

భార్య ఆత్మహత్యతో మనస్తాపం చెంది భర్త ఆత్మహత్య
ఇదిలావుంటే, మెదక్ జిల్లా కొండపాక మండలం కుక్కునూరులో విషాద సంఘటన చోటు చేసుకుంది. పిట్ల శ్రనివాస్ అనే 26 ఏళ్ల వ్యక్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదు రోజుల క్రితం హైదరాబాదులో భార్య ఆత్మహత్య చేసుకుంది. దాంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ తానూ ఆత్మహత్య చేసుకున్నాడని సమాచారం.












Click it and Unblock the Notifications