మాధవ్ అరెస్ట్ లో నిబంధనల ఉల్లంఘన - పోలీసు అధికారులపై వేటు..!!

ఏపీలో రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా జగన్ సతీమణి భారతి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన చేబ్రోలు కిరణ్ అరెస్ట్ సమయం లో వైసీపీ నేత గోరంట్ల మాధవ్ దాడికి ప్రయత్నించారు. దీంతో, మాధవ్ ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. న్యాయస్థానం రిమాండ్ విధించింది. కాగా, మాధవ్ ఎపిసోడ్ లో నిబంధన లను ఉల్లంఘించారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో.. పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనలో బాధ్యులైన పోలీసుల పైన వేటు వేసారు.

నిబంధనల ఉల్లంఘన
వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసుల అదుపులో ఉన్న చేబ్రోలు కిరణ్ పైన దాడికి ప్రయత్నించిన ఘటనలో మాధవ్ ను అరెస్ట్ చేసారు. ఈ పరిణామాల పైన పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అరెస్ట్‌ చేసిన దగ్గర నుంచి కోర్టులో హాజరు పర్చే వరకు పలుమార్లు మాజీ ఎంపీ మాధవ్‌ నిబంధనలను ఉల్లంఘించినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఉన్నతాధికారులు తీవ్రంగా పరిగణించారు. దీనిపై గుంటూరు సౌత్‌ డీఎస్పీతో విచారణ చేయించి, ఆ నివేదిక ఆధారంగా 11 మందిని సస్పెండ్‌ చేశారు. ఈ మొత్తం వ్యవహారం పైన విచారణకు గుంటూరు సౌత్‌ డీఎస్పీ భానోదయను నియమించారు. మాధవ్‌ను జీజీహెచ్‌లో వైద్య పరీక్షలకు తీసుకెళ్లినప్పడు అక్కడ ఆయన ఫోన్‌లో మాట్లాడినా బందోబస్తు సిబ్బంది అడ్డు చెప్పక పోవటం పైన సీరియస్ అయ్యారు.

eleven-police-officers-suspended-in-ycp-leader-gorntla-madhav-episode-in-guntur

మాధవ్ అరెస్ట్ వేళ
మాధవ్ ను మీడియా ముందు ప్రవేశపెట్టే ముందు ముసుగు వేసుకోవటానికి నిరాకరించి, తనకే ముసుగు వేస్తారా అంటూ పోలీసులపై కన్నెర చేశారు. మాధవ్ కోర్టు వద్ద పోలీస్‌ వాహనంలోంచి దిగి నేరుగా న్యాయస్థానంలోకి వెళ్లిపోయారు. ఇవన్నీ పోలీసుల వైఫల్యమేనని ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలో ఆ రోజు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్సైలు, సిబ్బంది నుంచి డీఎస్పీ భానోదయ వాంగ్మూలాలు నమోదు చేశారు. కస్టడీలో ఉన్న వ్యక్తికి మరో వైఎస్సార్సీపీ నాయకుడు ఫోన్‌ తీసుకొచ్చి ఇచ్చినా అక్కడున్న పోలీసులు పట్టించుకోకపోవడానికి కారణాలతో పాటుగా ..ఎందుకు నిర్లక్ష్యంగా ఉన్నారో ఆరా తీశారు. మాజీ ఎంపీని నల్లపాడు స్టేషన్‌ నుంచి జీజీహెచ్‌కు వైద్య పరీక్షలకు తీసుకెళ్లి అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి, తర్వాత కోర్టుకు తరలించే వరకు బందోబస్తు విధుల్లో ఉన్న సీఐ, ఎస్సై, ఇతర సిబ్బందిని డీఎస్పీ భానోదయ విచారించారు.

Take a Poll

11 మంది పై వేటు
డీఎస్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 11 మంది పోలీస్‌ సిబ్బందిపై గుంటూరు రేంజ్‌ ఐజీ వేటు వేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. గోరంట్ల మాధవ్ అరెస్ట్‌లో నిర్లక్ష్యంగా ఉన్న 11 మంది పోలీస్ అధికారులు సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులిచ్చారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఒక సీఐ, ఇద్దరు ఎస్సైలు, ఇద్దరు ఏఎస్ఐలు ఉన్నారు. అదే విధంగా మరో హెడ్ కానిస్టేబుల్‌తో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సీతారామయ్యను బదిలీ చేశారు. గోరంట్ల మాధవ్ పోలీసులతో వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇప్పుడు ఏకంగా 11 మంది పోలీసు సిబ్బంది పైన చర్యలు తీసుకోవటం సంచలన నిర్ణయం గా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+