నాగ్, వెంకటేష్‌లకు శిక్షణ ఇచ్చిన ప్రముఖ రంగస్థల నటుడు చాట్ల కన్నుమూత

విజయవాడ: ప్రముఖ రంగస్థల నటులు చాట్ల శ్రీరాములు కన్నుమూశారు. అనారోగ్యంతో సికింద్రాబాద్‌ రైల్వే ఆసుపత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. 1931 డిసెంబర్ 5వ తేదీన చాట్ల శ్రీరాములు విజయవాడలో జన్మించారు.

కేంద్ర సంగీత నాటక అకాడమీ ఎన్టీఆర్‌ పురస్కారాన్ని, పొట్టి శ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్‌ అందుకున్నారు. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూ 1976 నుంచి చాట్ల శ్రీరాములు నాటకరంగానికి అంకితమయ్యారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో తొలి అనౌన్సర్‌గా శ్రీరాములు పనిచేశారు.

Eminent theatre artist Chatla Sreeramulu passes away

తెలుగు చలనచిత్ర నటులు వెంకటేష్, నాగార్జున, రామ్‌లకు చాట్ల శ్రీరాములు నటనలో శిక్షణ ఇచ్చారు. విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన మేవాడు పతనం అనే హిందీ నాటకంలో ఓ బాబులని పాత్రను పోషించడం ద్వారా ఆయన రంగస్థల ప్రవేశం చేశారు.

న్యాయం కావాలి, స్పప్న సినిమాల్లో కూడా చాట్ల శ్రీరాములు నటించారు. దాదాపు వందకు పైగా నాటకాల్లో నటించి, దర్శకత్వం వహించారు. ఆయన నటించిన నాటకాల్లో మరో మొహంజోదారో అత్యంత ప్రఖ్యాతి వహించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+