కళ్లు చెమర్చాయి: ఏపీ-టీ ఉద్యోగులు విడిపోతూ... (పిక్చర్స్)
హైదరాబాద్/విజయవాడ: అమరావతికి వెళ్తున్న ఏపీ ఉద్యోగులు కంటతడి పెట్టారు! ఇన్నాళ్లు తెలంగాణ ఉద్యోగులతో కలిసి పని చేసి, వారిని విడిచి పోతున్నందుకు కొందరు, తెలంగాణ ఉద్యోగుల్లో తమ ప్రాణ స్నేహితులకు దూరమవుతున్నందుకు మరికొందరు కంటతడి పెట్టారు.
ఇటు తెలంగాణ, అటు ఏపీ ఉద్యోగులు కూడా ఒకరినొకరు దగ్గరకు తీసుకొని కంటతడి పెట్టారు. ఇది చూసిన వారి కళ్లు చెమ్మగిల్లాయి. విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు అమరావతికి తరలి వెళ్తున్నారు. ఈ క్రమంలో గురువారం నాడు 150 మంది ఉద్యోగులు ఏపీకి తరలి వెళ్తున్నారు.
వారు బస్సు ఎక్కే ముందు ఇక్కడి ఉద్యోగులు, స్నేహితులు వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా వారి మధ్య ఉద్వేగపూరిత వాతావరణం కనిపించింది. భారమైన మనసుతో ఉద్యోగులు బస్సెక్కారు. పలువురు విడిచిపోతున్నందుకు ఏడ్చారు.
ఈ సందర్భంగా పలువురు ఉద్యోగులు మాట్లాడుతూ.. తాము ఎప్పటికైనా స్వరాష్ట్రానికి వెళ్లాలని, తమ రాష్ట్రం వెళ్తున్నందుకు ఓ వైపు సంతోషంగా ఉందని, మరోవైపు స్నేహితులను విడిచిపోతున్నందుకు బాధగా ఉందని చెప్పారు. ఇక్కడే ఇన్నాళ్లు ఉండి అందరితో కలిసిపోయామన్నారు.
విభజన నేపథ్యంలో మా రాష్ట్రానికి మేం సేవ చేసుకోవాల్సి ఉందని చెప్పారు. స్వరాష్ట్రం సాధించుకనేందుకు తెలంగాణ వాళ్లు బాగా పోరాడారని, ఎక్కడ ఎలా ఉందో తమకు తెలియదని, తాము మాత్రం ఇక్కడ తెలంగాణ - ఏపీ ఉద్యోగులం కలిసి పని చేశామన్నారు. ఇరు రాష్ట్రాలు కూడా హాయిగా ఉండాలని, తెలుగు రాష్ట్రాలు సమస్యల పైన పోట్లాడుకోవద్దని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు ప్రభుత్వాలు సహకరించుకోవాలన్నారు.

భావోద్వేగం
ఈ ఉద్యోగులు అందరూ దశాబ్దాలపాటు కలసి మెలిసి పని చేశారు. ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలుపంచుకున్నారు. కులాలు, ప్రాంతాలు వారి అనుబంధానికి ఎప్పుడూ అడ్డుగోడలు కాలేదు.

భావోద్వేగం
కానీ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ ఉద్యోగులు అమరావతికి వెళ్లవలసి వచ్చింది. విడిపోవడం, తరలిపోవడం అనివార్యమయింది.

భావోద్వేగం
హైదరాబాద్‌తో దశాబ్దాలపాటు పెనవేసుకున్న అనుబంధం గురువారంతో ముగిసింది! ఇక మనం ఇలాగే రోజూ కలవబోమన్న భావన వారి గుండె కలుక్కుమనేలా చేసింది. దీంతో భావోద్వేగానికి గురయ్యారు.

భావోద్వేగం
కన్నీళ్ల మధ్య కౌగిలింతలు, వీడ్కోళ్లు. గుంటూరుకు తరలివెళ్లిన ఏపి వ్యవసాయ శాఖ కమిషనరేట్ వద్ద కనిపించిన ఆంధ్ర-తెలంగాణ మహిళా ఉద్యోగినుల భావోద్వేగానికి లోనయ్యారు.

భావోద్వేగం
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ నెల 27లోగా అన్ని ప్రభుత్వ శాఖలు, హెచ్‌ఓడీలు వెలగపూడికి తరలివెళ్లాలన్న ప్రభుత్వ ఆదేశాలతో ఇప్పటికే పలు శాఖలు తరలివెళ్లాయి.

భావోద్వేగం
అందులో భాగంగా వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని గుంటూరుకు తరలిస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ-ఆంధ్ర ఉద్యోగులు బషీర్‌బాగ్‌లోని కమిషనరేట్‌లో కలివిడిగా పని చేస్తున్నారు.

భావోద్వేగం
గురువారం గుంటూరుకు తరలివెళ్లేందుకు, మహిళా ఉద్యోగినులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. అంతకుముందు, అక్కడికి చేరిన తెలంగాణ మహిళా ఉద్యోగినులు ఇప్పటివరకూ లంచ్ టైంలో కలసి భోజనం చేసి, సాయంవేళ ఒకే బస్సుల్లో వెళ్లి, ఒకరి ఇళ్లలో జరిగే మంచీ చెడుకు మరొకరు తోడుగా నిలిచిన తీపి అనుభవాలను గుర్తుచేసుకుని, కన్నీటి పర్యంతమయ్యారు.

భావోద్వేగం
తమను విడిచి వెళ్లిపోతున్న ఏపి ఉద్యోగినులను ఆలింగనం చేసుకుని, కన్నీటితో వీడ్కోలు పలికారు. కొందరు బొట్టు పెట్టి చీరలు పెట్టారు. ఈ దృశ్యాలను చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి.












Click it and Unblock the Notifications