ఎన్‌కౌంటర్ ఎఫెక్ట్: బాబు, లోకేష్‌లకు భద్రత పెంపు, జాగ్రత్తలు
అమరావతి/విశాఖ: ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో భారీ ఎన్‌కౌంటర్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై ఆత్మాహుతి దాడులకు పాల్పడుతామంటూ మావోయిస్టుల పేరిట బెదిరింపు లేఖలు వచ్చిన నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.
చంద్రబాబు భద్రతను మరింత పెంచారు. రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు కూడా భద్రత పెంచారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని గ్రామాల్లో పర్యటించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన ప్రజాప్రతినిధులను అప్రమత్తం చేసినట్లు సమాచారం.

పోలీసు అధికారులకు కూడా రక్షణ పెంచారు. మావో ప్రభావిత ప్రాంతాల్లోకి వెళ్లినప్పుడు రక్షణ చర్యలపరంగా వ్యూహాత్మకంగా వ్యవహరించాలని సూచించినట్లు తెలిసింది.
భారీ ఎన్ కౌంటర్ నేపథ్యంలో మావోయిస్టులు ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందని ఏపీ పోలీసు శాఖ పేర్కొంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించే ముందు తమకు సమాచారం అందించాలని తెలిపింది. సమాచారం ఇవ్వకుండా వెళ్లొద్దని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్ల భద్రతా దళాలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.












Click it and Unblock the Notifications