మిథున్ రెడ్డికి పిలుపు, మారుతున్న ఢిల్లీ లెక్కలు..!!
ఢిల్లీ కేంద్రంగా ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఏపీలో కూటమి పార్టీలు 2029 ఎన్నికలే లక్ష్యంగా కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నాయి. మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా జిల్లాల యాత్రలకు సిద్దం అవుతున్నారు. ఇదే సమయంలో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ సంచలనంగా మారుతోంది. లిక్కర్ కేసులో ఈడీ విచారణ మొదలైంది. సాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. కాగా, ఇప్పుడు మిథున్ రెడ్డి విషయం లో చోటు చేసుకున్న తాజా పరిణామాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి.
వైసీసీలోని ముఖ్య నేతలకు కేసుల్లో ఉచ్చు బిగుస్తోంది. లిక్కర్ కేసులో మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డికి ఈడీ తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఇదే కేసులో సెట్ విచారణకు హాజరైన విజయ సాయిరెడ్డి కీలక అంశాలను ప్రస్తావించారు. తాను ఈ కేసులో విజిల్ బ్లోయర్ అంటూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టు సంచలనంగా మారింది. ఈ కేసులో రాజ్ కెసిరెడ్డిని సూత్రధారిగా పేర్కొంటూ ఆరోపణలు చేశారు.

మద్యం విధానం అమలులో తాను నేరుగా ఎప్పుడూ జోక్యం చేసుకోలేదని, అమ్మకాలతో తనకు సంబంధం లేదని గతంలో సిట్ ముందు స్పష్టం చేస్తూనే.. తాను దర్యాప్తుగా సహకరిస్తానని విజయ సాయిరెడ్డి తేల్చి చెప్పారు. కాగా, ఈ కేసులో సిట్ ఇప్పటి వరకు సిట్ మొత్తం 16 మందిని అరెస్టు చేసింది. మొత్తం 48 మందిపై కేసులు నమోదయ్యాయి. మూడు ఛార్జిషీట్లు దాఖలు చేసింది.
కాగా, ఈ మద్యం కేసులో మనీ లాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా విజయసాయిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఇక.. ఇదే కేసులో అరెస్ట్ అయి బెయిల్ పైన విడుదలైన ఎంపీ మిథున్ రెడ్డికి సైతం తాజాగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 23న విచారణకు హాజరు కావాలని సూచించింది. మద్యం అమ్మకాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిబంధనలకు విరుద్ధంగా మళ్లించారనే ఆరోపణలపై ఈడీ విచారణ జరుపుతోంది.
అసలు తనకు ఈ కేసుతో సంబంధం లేదని మిథున్ రెడ్డి చెబుతున్నారు. కాగా.. తాజాగా విజయ సాయి రెడ్డి పరోక్షంగా జగన్ కోటరీని ప్రస్తావిస్తూ.. వెనిజులా లో చోటు చేసుకున్న ఘటనలను ప్రస్తావిస్తూ చేసిన ట్వీట్ సంచలనంగా మారింది. ఢిల్లీ కేంద్రంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ఆధారంగానే సాయిరెడ్డి ఈ ట్వీట్ చేసారనే చర్చ సాగుతోంది. ఇక.. లిక్కర్ కేసులో ఏపీ కేంద్రంగా కొంత వేగం తగ్గిన సమయంలో.. ఇప్పుడు ఈడీ నోటీసులు.. విచారణ ఈ కేసులో కీలక మలుపుగా మారుతోంది. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు ఆసక్తి కరంగా మారే అవకాశం ఉంది.
-
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000












Click it and Unblock the Notifications