కావలిలో దారుణం: బిల్డింగ్ పైనుంచి దూకిన ఇంజనీరింగ్ విద్యార్ధిని

అమరావతి: నెల్లూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కావలిలో ఉన్న విట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఓ విద్యార్ధిని బిల్డింగ్‌పై నుంచి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గమనించిన కాలేజీ యాజమాన్యం వెంటనే విద్యార్ధినిని సమీప ఆసుపత్రికి తరలించారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్ధిని హరిప్రియగా పోలీసులు గుర్తించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హరిప్రియ మాస్ కాపీయింగ్‌కు పాల్పడింది.

Engineering student commit suicide in nellore district

దీంతో ఇన్విజిలేటర్ పట్టుకున్నారు. ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన హరిప్రియ ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిందని ఆమె తోటి విద్యార్ధినులు పోలీసులకు దర్యాప్తులో తెలిపారు.

విశాఖలో పట్టపగలే దొంగల బీభత్సం:

విశాఖపట్నంలో పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయ గుమాస్తాపై దాడి చేసి హుండీని ఎత్తుకెళ్లారు. ఈ సంఘటన అక్కిరెడ్డిపల్లిలోని బీహెచ్‌పీవీ సమీపంలోని ప్రసన్న వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది.

ఆలయంలోకి ప్రవేశించిన గుర్తుతెలియని వ్యక్తులు గుమస్తా కాల్లు చేతులు కట్టేసి, ఆయన తలపై గాయపరిచి దేవాలయ హుండీని ఎత్తుకెళ్లారు. గుమస్తాకు తీవ్రగాయాలు కావడంతో అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+