దేవాశిష్ అంతిమయాత్ర: మరో 2మృతదేహాలు(పిక్చర్స్)

సిమ్లా/హైదరాబాద్: హిమాచల్‌ప్రదేశ్‌లో బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు కొనసాగుతోంది. గురువారం మరో ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. అందులో ఒకటి ఖమ్మం జిల్లాలోని పాల్వంచకు చెందిన టి ఉపేందర్, మరొకటి హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురంకు చెందిన గోనూరు అరవింద్ కుమార్‌ది వారి బంధువులు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

జూన్ 8న విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌లోని విఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 24 మంది విద్యార్థులు బియాస్ నదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సహాయక బృందాలు ఎనిమిది మృతదేహాలను వెలికితీశాయి. గల్లంతైన మరో 16 మంది విద్యార్థుల కోసం ఎన్డీఆర్ఎఫ్, ఐటిబిపి సిబ్బంది గాలింపు కొనసాగిస్తున్నారు. కాగా, బియాస్ నదిలో లభ్యమైన షాబీర్ హుస్సేన్ మృతదేహాన్ని గురువారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. షాబీర్ మృతితో అతని కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

బియాస్ నదిలో గల్లంతైన విద్యార్థుల కోసం ఐదోరోజు గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఎన్‌డిఎంఏ వైస్ ఛైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. గజ ఈతగాళ్లతో గాలింపు చేపడుతున్నట్లు చెప్పారు. సహాయక సిబ్బంది చేరుకోలేని ప్రాంతాల్లో ఏరియల్ వెహికల్‌తో గాలింపు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యార్థుల మృతదేహాలను తొందరగా వెలికితీసేందుకు చర్యలు తీసుకున్నామని తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు.

ఇది ఇలా ఉండగా మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న దేవాదేవాశిష్ బోస్ మృతదేహానికి బుధవారం కింగ్ కోఠిలోని స్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంతక్రియలు నిర్వహించారు. ఎంతో ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో దేవాశిష్ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ‘చింటూ.. చింటూ నీతో పాటు నేను వస్తారా.. ప్లీజ్ నన్నూ నీతోపాటు తీసుకుపోరా' అంటూ దేవాశిష్ తల్లి నిర్మల రోదించిన తీరు ప్రతీ ఒక్కరినీ కలిచివేసింది.

బుధవారం ఉదయం 10గంటలకు బాగ్‌అంబర్‌పేట సిఈ కాలనీలోని దేవాశిష్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. బంధువులు, తోటి విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. గన్‌ఫౌండ్రీలోని సెయింట్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దేవాశిష్ మృతదేహాన్ని కింగ్ కోఠిలోని స్మశానవాటికకు తీసుకొచ్చి అంతక్రియలు నిర్వహించారు.

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్ర

మంగళవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకున్న దేవాదేవాశిష్ బోస్ మృతదేహానికి బుధవారం కింగ్ కోఠిలోని స్మశానవాటికలో అశ్రునయనాల మధ్య అంతక్రియలు నిర్వహించారు.

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్ర

ఎంతో ఆనందంగా విహారయాత్రకు వెళ్లిన తమ కుమారుడు విగత జీవిగా ఇంటికి తిరిగి రావడంతో దేవాశిష్ తల్లి నిర్మల కన్నీరుమున్నీరయ్యారు.

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్ర

‘చింటూ.. చింటూ నీతో పాటు నేను వస్తారా.. ప్లీజ్ నన్నూ నీతోపాటు తీసుకుపోరా' అంటూ దేవాశిష్ తల్లి నిర్మల రోదించిన తీరు ప్రతీ ఒక్కరినీ కలిచివేసింది.

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్ర

బుధవారం ఉదయం 10గంటలకు బాగ్‌అంబర్‌పేట సిఈ కాలనీలోని దేవాశిష్ నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది.

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్రలో బంధువులు, తోటి విద్యార్థులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

దేవాశిష్ అంతిమయాత్ర

దేవాశిష్ అంతిమయాత్ర

గన్‌ఫౌండ్రీలోని సెయింట్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనల అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో దేవాశిష్ మృతదేహాన్ని కింగ్ కోఠిలోని స్మశానవాటికకు తీసుకొచ్చి అంతక్రియలు నిర్వహించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+