ఏపీలో మారుతున్న సీన్..ఆ పార్టీ వైపే మొగ్గు
ఏపీ రాజకీయాలు మొత్తం కూడా ముస్లిం రిజర్వేషన్ల చూట్టునే తిరుగుతున్నాయి. అధికారంలోకి వచ్చిన వెంటనే ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. దీని ప్రభావం ఏపీలో ఉన్న కూటమిపై కనిపించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఏపీలో టీడీపీ , జనసేన పార్టీలు బీజేపీతో కలిసి ఎన్నికలకు వెళ్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ప్రకటించడంతో ఏపీలో ప్రధాన ప్రతిపక్షం అయిన టీడీపీ ఇరాకటంలో పడింది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ ఏం చేయాలో తెలియని ధర్మసంకటంలో నిలిచింది. దీని ప్రభావం కచ్చింతంగా టీడీపీపై పడుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.పొత్తులో భాగంగా ఏపీలో కూడా ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తీసేస్తారనే అభద్రతాభావంతో ఉన్నారు.

ముస్లింలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయ ప్రభావం కచ్చింతంగా వచ్చే ఎన్నికల్లో కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ముఖ్యంగా ముస్లిం ప్రజలు ఉండే నియోజకవర్గాల్లో ఫలితాలు మార్చే విధంగా దీని ప్రభావం ఉంటుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీనిపై అధికార వైసీపీ మాటల యుద్ధం మొదలుపెట్టింది.
ముస్లింలకు ఉన్న 4 శాతం రిజర్వేషన్ తీసేస్తామని బీజేపీ నాయకులు చెబుతున్నారని..దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.పొత్తులో భాగంగా ఏపీలో కూడా ముస్లింలకు ఉన్న 4శాతం రిజర్వేషన్ తీసేస్తారా..? లేదా బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తారా అంటూ టీడీపీని వైసీపీ అధినేత జగన్ సూటిగానే కూటమి నేతలను ప్రశ్నిస్తున్నారు.
దీనికి తోడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ముస్లిం రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్‌పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బీజేపీ తీసుకున్న ఈ నిర్ణయం కచ్చింతంగా అధికార వైసీపీకి కలిసి వచ్చే అంశంగా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. దాదాపు 15 నియోజకవర్గాల్లో ముస్లింల ప్రభావం ఉంటుందని..వారందరూ వైసీపీకి మద్దతు నిలిచే అవకాశాలు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. దీన్ని బట్టి చూస్తూ ముస్లిం నియోజకవర్గాల్లో వేవ్ వైసీపీ వైపే మొగ్గు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications