బాబు రికార్డ్‌లు, రివర్స్: కేసీఆర్ రికార్డ్‌లు మావద్ద, దమ్ముంటే రావాలని ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎమ్మెల్యేలకు డబ్బు ఆఫర్ చేసినట్లు తమ వద్ద ఆధారాలున్నాయని, ఆ ఫోన్ రికార్డులను తాము నేరుగా కేంద్ర ప్రభుత్వానికి అప్పగిస్తామని తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావు గురువారం అన్నారు.
వరంగల్ జిల్లా పాలకుర్తిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేసీఆర్ ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి రూ.20 కోట్ల ఆఫర్ చేశాడని, అందుకు ఆధారాలున్నాయని చెప్పారు. టీడీపీ నుండి తెరాసలోకి వెళ్లిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి.. కేసీఆర్ డబ్బులిస్తేనే పార్టీలోకి వెళ్లానని చెప్పారన్నారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి మాట్లాడాటని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి చెప్పడం వెనుక కుట్ర దాగి ఉందన్నారు. నాయిని బాధ్యతారాహిత్యంతో మాట్లాడుతున్నాడని విమర్శించారు.
చంద్రబాబు చేసిన ఫోన్ల సమాచారం తమ దగ్గర ఉందని, కేసులు పెడతామని హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి అంటున్నారని, మేం దేనికైనా సిద్ధంగా ఉన్నామని, అయితే కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలకు చేసిన ఫోన్లపై విచారణ చేసే దమ్ము తెరాస ప్రభుత్వానికి ఉందా? ఉంటే ముందుకు రావాలని తెలంగాణ టీడీపీ నేతలు సవాల్ చేశారు.

రేవంత్ రెడ్డి కేసుపై పెద్ద గందరగోళం జరిగిన తర్వాత కూడా, తెరాస నేతలు టీడీపీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి ఫోన్లు చేసి తమ పార్టీలోకి రావాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థికి ఓటు వేయాలని కోరారని, ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ నేతలు రావుల చంద్రశేఖర రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రాజారాం యాదవ్, పీ రాములు గురువారం విలేకరులతో మాట్లాడారు.
ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా కేసీఆర్ టీడీపీ నేతల ఇళ్లకు వెళ్లి నాలుగైదు గంటలు కూర్చుని, వారిని ప్రలోభపెట్టి పార్టీలో చేర్చుకున్నారని, ఒక ముఖ్యమంత్రి ఇతర పార్టీల నేతల ఇళ్లకు వెళ్లి ప్రలోభపెట్టడం చరిత్రలో ఎక్కడైనా ఉందా? అది రాజకీయ అవినీతి కాదా? తెరాసకు 63 మంది ఎమ్మెల్యేలు ఉంటే, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి 85 ఓట్లు ఎలా పడ్డాయి? దానికి సూత్రధారి ఎవరు? వీటిపై విచారణ జరపవద్దా? టీడీపీ నుంచి తెరాసలోకి వెళ్లిన ఒక ఎమ్మెల్యే తనకు రూ.250 కోట్ల ప్యాకేజీ ఇస్తామన్నారని బహిరంగంగా చెప్పారని ఆరోపించారు.
ఒప్పుకొంటే పనులు ప్యాకేజీలు లేకపోతే పోలీసులా? చంద్రబాబుతోపాటు వీటన్నింటిపైనా విచారణ చేద్దామని సవాల్ చేశారు. చేతనైతే రావాలన్నారు. రేవంత్ రెడ్డి వ్యవహారంపై తాము ఎవరికీ ఏ సీడీలూ ఇవ్వలేదని ఏసీబీ అధికారులు చెబుతుంటే, తమ వద్ద అన్ని సాక్ష్యాధారాలూ ఉన్నాయని హోం మంత్రి చెబుతున్నారని విమర్శించారు.
ఎవరుపడితే వాళ్లు ఫోన్లు ట్యాప్ చేస్తారా? దీనికేమీ చట్టాలు లేవా? ముఖ్యమంత్రి, ఆయన కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు ఎవరికి ఫోన్లు చేసినా అవి వినపడవని, ప్రత్యర్థి పార్టీల ఫోన్లు మాత్రం వినపడతాయని ధ్వజమెత్తారు. తెలంగాణలో తాము తప్ప మరొకరు ఉండకూడని రాజకీయ శూన్యత సృష్టించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
-
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్ -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
తిరుపతిలో ఎయిర్ పోర్టును తలదన్నేలా..!! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
బిగ్ షాక్: ఏప్రిల్ 1 నుంచి పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు.. -
రాహుల్ గాంధీతో డేటింగ్ కోరిక తీరలేదు - బాలీవుడ్ స్టార్












Click it and Unblock the Notifications