కొడుక్కి అప్పనంగా సొమ్ము, బాబు కాదంటారా: కెసిఆర్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర రావుపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబును టీఆర్‌ఎస్ నేతలు అకారణంగా టార్గెట్ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ నోరు తెరిస్తే అన్నీ అబద్దాలే అని దుయ్యబట్టారు.
మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ అభివృద్ధిపై చర్చకు రావాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టోపై ఎందుకు ప్రస్తావించలేదని ఆయన ప్రశ్నించారు. వాటర్ గ్రిడ్ పేరుతో కేసీఆర్ ఆయన కొడుకు కేటీఆర్‌కు రాష్ట్ర సొమ్మును అప్పనంగా కట్టబెడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తాన్న కేసీఆర్ మాటతప్పారని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజలు కేసీఆర్‌ను పరిస్థితి లేదన్నారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తెలంగాణ మిగులు బడ్జెట్ సాధించడానికి చంద్రబాబే కారణమని, అటువంటి చంద్రబాబుపై కేసీఆర్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైదరాబాద్‌ను ఎవరు అభివృద్ధి చేశారో చర్చకు తాము సిద్ధమని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను ఎవరూ నమ్మే పరిస్థితి లేదని ఎర్రబెల్లి అన్నారు.
ఇదిలావుంటే, నిరుద్యోగ యువతకు అన్యాయం చేసే విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ విధానాలపై నిప్పులు చెరిగారు. నిరుద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని ధ్వజమెత్తారు.
లక్షల మంది పేద విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఎన్నికల మందు కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేసి, ఆ వ్యవస్థను రద్దు చేస్తామన్న కేసీఆర్ ఇప్పుడు చడీచప్పుడు లేకుండా ఉన్నారని విమర్శించారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను ఎందుకు రెగ్యులరైజ్ చేయడం లేదని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
-
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
పవన్ కళ్యాణ్‌ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు -
IPL తొలి మ్యాచ్ లోనే సెన్సేషన్, ఎవరీ కూపర్ కనోలీ - సూర్యవంశీని డామినేట్ చేస్తూ..!! -
పాల ధరలు భారీగా పెంపు, ఒకే సారి - కొత్త రేట్లు ఇలా..!! -
రైతు భరోసా అమలులో కీలక మార్పులు, ఇక వారికీ వర్తింపు - నిధుల జమ ముహూర్తం..!! -
Amaravati Bill: పార్లమెంట్ లో అమరావతి బిల్లు..! కాంగ్రెస్ స్టాండ్ ఇదే..! -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
జన్మ నక్షత్రం మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
ఈ టైంలో కరెంట్ వాడితే బాదుడే, విద్యుత్ ఛార్జీల్లో మార్పులు - నేటి నుంచే అమలు..!! -
అయోధ్య రాముని సన్నిధిలో గౌతమ్ అదానీ..!











Click it and Unblock the Notifications